Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామన్వెల్త్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌: గగన్‌కు రజతం

హైదరాబాద్: గోల్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్ సత్తా చోటుతోంది. గురువారం మరో మూడు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన గగన నారంగ్ తాజాగా కామన్వెల్త్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించాడు.

పురుషుల 50మీ రైఫిల్‌ ప్రోన్‌లో గగన్‌ నారంగ్‌ రజతం సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది అతనికిదే తొలి పతకం కావడం విశేషం. మరోవైపు ఇదే ఈవెంట్‌లో యువ షూటర్‌ స్వప్నిల్‌ కాంస్యం చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో నారంగ్‌ 246.3 పాయింట్లు స్కోరు చేయగా, ఆసీస్‌కు చెందిన డేన్‌ శాంప్సన్‌ (247.7) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.

Gagan Narang wins silver in Commonwealth Shooting Championships

ఇక మహిళల 25మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో అన్నూ రాజ్‌ సింగ్‌ కాంస్యం నెగ్గగా హీనా సిద్ధూ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. కామన్వెల్త్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌‌లో ఇప్పటివరకు భారత షూటర్లు రైఫిల్‌, పిస్టల్‌ విభాగాల్లో పది పతకాలు సాధించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+