For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె పగిలే ఓటమి: డివిలియర్స్, ముంచింది దక్షిణాఫ్రికావాడే

ఆక్లాండ్: ప్రపంచ కప్ టోర్నీలో సెమీస్ చేరాలనుకున్న దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్ల ఆశలు అడియాశలు కావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మంగళవారం జరిగిన సెమీ ఫైనళ్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన సఫారీ జట్టు కన్నీంటి పర్యాంతమవుతూ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తమ జట్టు ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించడం తమకు ఎంతో బాధను కలిగించిందని దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఏబి డివిలియర్స్ ఆవేదనగా తెలిపాడు. నాలుగు వికెట్ల తేడాతో కివీస్ చేతిలో ఓటమి అనంతరం మైదానంలోనే కంటతడి పెట్టుకున్నాడు. తమ దేశానికి కప్ అందించాలనుకున్నట్లు పేర్కొన్నాడు. పరాజయం పాలైనప్పటికీ తమ జట్టు సభ్యులందరూ సమష్టిగా రాణించారని తెలిపాడు.

మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఏబి డివిలియర్స్

సెమీస్‌లో ఓటమి పాలవడంపై మీ స్పందన?

ఏబి డివిలియర్స్: అవును. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. మీకు తెలుసు. ఇక మేము ఈ రోజు రాత్రి స్వదేశానికి వెళ్లాల్సి ఉంది. మ్యాచ్ సెకాండఫ్‌లో కొంత విఫలమయ్యాం. ఈ ఓటమి గురించి ఏమి చెప్పగలం. చాలా బాధగా ఉంది. మాకు మద్దతు తెలిపేందుకు వచ్చి ప్రజలు వెనక్కివెళ్లారు.

మా దేశ అభిమానులందరికీ ఇది తీరని నిరాశను కలిగించింది. అయితే జీవితం కొనసాగుతుంది. సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడని మా కోచ్ టోర్నమెంటులో చెప్పేవాడు. టోర్నీని చాలా ఎంజాయ్ చేశాం. ప్రతీ మ్యాచులో తమ జట్టు ఆటగాళ్లందరూ గెలుపు కోసం సమష్టిగా పోరాటం చేశారు. అయితే సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టు అద్భుత ఆటతీరును కనబర్చి గెలుపును సొంతం చేసుకుంది.

మీరు మర్చిపోలేని మ్యాచ్ ఏదైనా?

ఏబి డివిలియర్స్: ఈ మ్యాచ్ ఓటమి తమను చాలా బాధకు గురి చేసింది. ఈ మ్యాచులో గెలిచి తమ దేశ చిరకాల కోరిక అయిన ప్రపంచ కప్ ట్రోఫీని అందించాలనుకున్నాం. ఓటమి తమను ఎంతో బాధకు, ఆవేదనకు గురిచేసింది. మాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం.

Full Text: AB de Villiers speaks on 'painful' World Cup exit

వెర్నన్ ఫిలాండర్ ఎంపిక గురించి చింతించారా?

ఏబి డివిలియర్స్: అతని ఎంపిక పట్ల తమకు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ మ్యాచులోనే కాదు, ఇతర మ్యాచుల్లోనూ.

కోరే అండర్సన్ రనౌట్ ఎలా మిస్ చేశారు?

ఏబి డివిలియర్స్: కోరే అండర్సన్‌ను రనౌట్ చేయలేకపోవడం ఈ మ్యాచులో గెలిచే అవకాశాన్ని దూరం చేసింది. చాలా ప్రయత్నించా.. కానీ కుదరలేదు. ఆ తర్వాత కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగపర్చుకోలేకపోయాం. పొరపాట్లకు తగిన మూల్యం చెల్లించుకున్నాం.

చివరి ఓవర్లో డేల్ స్టెయిన్‌కు ఏం సందేశమిచ్చారు?

ఏబి డివిలియర్స్: ప్రతీ బంతిని చర్చించి వదిలాం. యార్కర్, స్లోబాల్, హార్డ్ లెంత్ లాంటివన్ని సంధించేందుకు చర్చించుకున్నాం. పేస్ ఉపయోగించి వికెట్లు తీయాలనుకున్నాం.

దక్షిణాఫ్రికన్(గ్రాంట్ ఎలియెట్.. జోహన్నెస్‌బర్గ్‌లో పుట్టాడు) వల్లే మీరు ఓటమి చెందడం బాధించిందా?

ఏబి డివిలియర్స్: అలాంటిదేం లేదు. న్యూజిలాండ్‌తో ఈరోజు మ్యాచ్ ఆడాం. ఎలియట్ అద్భుతంగా ఆడాడు. అతని ఉత్తమ ప్రదర్శనను అతని జట్టుకోసం ప్రదర్శించాడు. అతనొక్కడే కాదు, జట్టు మొత్తం బాగా ఆడింది.

వర్షం కూడా మీ ఓటమి కారణమైందంటారా?

ఏబి డివిలియర్స్: వర్షం అడ్డంకి అయినప్పటికీ మ్యాచ్ గెలిచే అవకాశం మాకు ఉండేది. తమ జట్టు సమష్టిగా ఆడింది. అనుకున్నది జరగలేదు. అనుకోనిది జరిగింది. ఈ రోజంతా ఇలాగే ఉంది. మేము బాగానే ఆడాం. కానీ ఈ మ్యాచులో అది సరిపోలేదు.

మీరు చాలా ఆవేదనకు గురైనట్లున్నారు?

ఏబి డిలియర్స్: అవును.

ఈ ఓటమి నుంచి మీరు బయటపడేందుకు సమయం పడుతుందేమో?

ఏబి డివిలియర్స్: నాకు ఖచ్చితంగా తెలియదు. నాకు తెలియదు. ఎప్పుడు స్వదేశానికి వెళ్తామో. కొంత సమయం పడుతుంది. నేను జట్టు సారథిని.. నా జట్టు సభ్యులకు అండగా ఉంటా. జట్టు సభ్యులందరూ తమ శాయశక్తులా జట్టుకు విజయాన్నందించేందుకే ప్రయత్నించారు. అంతకుమించి ఏమి చేయలేరు కదా.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+