మీర్పూర్: బంగ్లాదేశ్‌తో మూడో వన్డేకు ఆల్ రౌండర్ రవీంద్ర జడెజాను పక్కన పెట్టడం పైన ట్విట్టర్‌లో జోకులు పేలుతున్నాయి. తొలి రెండు వన్డేలు జడెజా ఆడాడు. రెండో వన్డేకు రహానేను పక్కన పెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
అదే సమయంలో ధోనీ నిత్యం జడెజాను వెనుకేసుకు రావడంపై పలువురు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో మూడో వన్డేకు జడెజాను పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. జడెజా స్థానంలో స్టార్ట్ బిన్నీని తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఉమేష్ యాదవ్ వచ్చాడు.
సామాజిక అనుసంధాన వేదికలో అభిమానులు జడెజాను పక్కన పెట్టడంపై పెద్ద ఎత్తున స్పందించారు. ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందించారు. జడెజాను ధోని నిత్యం వెనుకేసుకు వస్తుంటాడనే విమర్శలు ఉన్నాయి. ఫాంలో లేనప్పటికీ అతనికి అండగా ఉంటాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు వన్డేల్లో జడెజా 32, 19 పరుగులు చేశాడు. రెండు మ్యాచుల్లోను ఒక్క వికెట్ కూడా తీయలేదు. కాగా, జడెజా మొత్తం 121 వన్డేలు ఆడి 1804 పరుగులు చేశాడు. 144 వికెట్లు తీశాడు. జడెజాను పక్కన పెట్టడంపై సోషల్ మీడియాలో ఇలా....