అడిలైడ్: ప్రపంచకప్‌లో భాగంగా భారత్ - పాకిస్తాన్ మధ్య అడిలైడ్‌లో మ్యాచ్ జరుగుతోంది. తొలుత భారత్ బ్యాటింగ్ చేసి పాక్ ముందు 301 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బౌలింగులో బౌలర్లు సత్తా చాటుతున్నారు. క్రమంగా భారత్ మ్యాచ్ పైన పట్టు బిగిస్తోంది.

భారత్ - పాక్ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా చూస్తారు. మరోవైపు భారత్ పట్టు బిగిస్తున్న కొద్ది అడిలైడ్‌లోని స్టేడియంలో భారత ఆటగాళ్ల ఆనందానికి అంతులేకుండా పోతోంది. మనోళ్లు సెంచరీ చేసినప్పుడు, ప్రత్యర్థి ఆటగాళ్లు అవుటవుతున్నప్పుడు లేచి గట్టిగా నినాదాలు చేస్తున్నారు.
టీవీలకు అతుక్కుపోయిన అభిమానులు సైతం పాక్ ఆటగాళ్లు అవుటైనప్పుడల్లా కేరింతలు కొడుతున్నారు. భారత్ - పాక్ మ్యాచ్ నేపథ్యంలో ట్విట్టర్లోను అభిమానులు స్పందిస్తున్నారు. సెంచరీ చేసిన కోహ్లీని అనిల్ కుంబ్లే ట్విట్టర్ ద్వారా అభినందించారు.