Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంట్లో కరెంటు కూడా లేని ఓ ఇండియన్ హాకీ వీరుడి కధ

From humble background to spotlight: Story of other Yuvraj
ముంబై: సాధారణంగా ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఉన్న యువరాజ్ సింగ్ గురించి అందరికి తెలుసు. ఇప్పుడు ఇండియన్ హాకీ టీమ్‌లో కూడా మరో యువరాజ్ ఉన్నాడు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవక ముందు ఈ యువరాజ్ వాల్మీకి ఎవరికి తెలియదు. కానీ ఇప్పడు యువరాజ్ వాల్మీకి పేరు యావత్ ముంబై వీధుల్లో మారుమ్రోగి పొతుంది. అందుకు కారణం ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలవడానికి ప్రదాన కారకుడు ఇతను కావడమే.

21 సంవత్సరాల వయసు కలిగిన యువరాజ్ వాల్మీకి జీవితాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు చలించకుండా ఉండలేరంటే నమ్మండి. ముంబైలోని మెరీన్ లైన్స్‌లో వాల్మీకిది చిన్న ఇల్లు. వర్షం కురిస్తే ఇంట్లో ఉండేవీలు లేక ప్లాస్టిక్ కవర్‌ను కప్పుకుని ఆరుబయట కూర్చొనే పరిస్థితి. వీధిలైట్ల కింద చదువుకునే దుస్థితి. అయినా అతడు తనకిష్టమైన హాకీని విడిచిపెట్టలేదు. తల్లిదండ్రులు చదువుకోమని ప్రోత్సహించినా... తాను ఎలాగైనా ఆటలో రాణిస్తానని పట్టుదలతో చెప్పాడు. అనుకున్నట్టుగానే ఇప్పుడు టీమిండియాలో సభ్యుడయ్యాడు. భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు.

తన కొడుకు విజయం వాల్మీకి తల్లి మీనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే అతడు భారత్‌లో అడుగుపెట్టగానే ముంబై ఎప్పుడొస్తాడా అని ఎదురుచూ సింది. ఆమెకు ఒకే ఒక్క కోరిక... తన కొడుకుకి ఇష్టమైన చికెన్ బిర్యానీని వండిపెట్టడం. కానీ అంత స్థోమత లేదు. అందుకే ఆమె తన భర్తను చిన్న కోరిక అడిగింది... ఇంటికొచ్చేటప్పుడు అతడి యజమాని దగ్గర ఓ వెయ్యి రూపాయలు అప్పుతెమ్మని కోరింది. 'మా అబ్బాయి జాతి మొత్తం గర్వించేలా చేశాడు. అతడిని మేం ఇప్పుడు సంతోషపెట్టాలి. తనకిష్టమైన చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై చేయాలి. అంతేకాదు ఓ వంద కొవ్వొత్తుల్ని తెమ్మని నా భర్తను కోరాను. ఎందుకంటే చాలా ఏళ్లుగా మా ఇంట్లో విద్యుత్ లేదు" అని మీనా కన్నీళ్ల పర్యంతమవుతూ చెప్పింది.

నిన్నమొన్నటిదాకా వాల్మీకి కుటుంబం పేదరికాన్ని చూసి ఎవ్వరూ పట్టించుకోని స్థానిక జనం ఇప్పుడు ఆ ఇంటికి క్యూ కట్టింది. పూల బొకేలతో అభినందనల వర్షం కురిపించింది. స్థానిక నాయకుల హడావుడి ఎలాగూ కొనసాగింది. వాల్మీకి నేపథ్యాన్ని తెలుసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. రూ.పది లక్షల నజరానాను ప్రకటించడమే కాకుండా క్లాస్-1 ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించింది. పేదరికం వెంటాడుతున్నా తానెప్పుడూ అధైర్యపడలేదని వాల్మీకి అంటున్నాడు. 'నాకు బూట్లు లేవు. కనీసం జెర్సీ, హాకీ స్టిక్ కూడా లేదు. అన్నీ నా కోచ్ ధన్‌రాజ్ పిళ్లై అమర్చారు. వాళ్ల మద్దతుతో రాణించాను. ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలి. కనీస సౌకర్యాలుండే ఓ సొంత ఇంటిని కొనుక్కోవాలి. ఈ కలలన్నీ ఏనాటికైనా నెరవేరుతాయని ఆశిస్తున్నా" అని వాల్మీకి ఆనందంతో అన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+