పోర్న్ స్టార్‌గా మారిన సూపర్ కార్స్ మహిళా రేసర్!!

సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ సూపర్ కార్స్ రేసర్ 'రెనీ గ్రేసీ'. ఆమె వయసు 25 ఏళ్లే. అంతేకాదు చూపు తిప్పుకోలేని అందం. 1998 నుంచి పూర్తి స్థాయి తొలి మహిళా సూపర్ కార్స్ రేసర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. అటు అందం ఇటు టాలెంట్‌కు తిరుగులేదు. అయితే 2017 నుంచి రేసింగ్‌లో తన ప్రదర్శన దిగజారడంతో పాటు ఆర్థికంగా తోడ్పాటు కూడా లేకపోవడంతో ఆమె కెరీర్‌కు దూరమైంది. ఇక బతుకుదెరువు కోసం ఓ కారు యార్డులో పనిచేయాల్సి వచ్చింది. పరిస్థితులు అనుకూలించక పోర్న్ స్టార్‌గా మారారు.

అడల్ట్ వెబ్‌సైట్ చూశాక:
ఓసారి ఓన్లీఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్‌సైట్ చూశాక తన కొత్త కెరీర్ ఇదే అని రెనీ గ్రేసీ డిసైడ్ అయ్యారు. ఇక ఆలస్యం చేయకుండా.. తన నగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడంతో తొలి వారంలోనే రెండున్నర లక్షల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు క్రేజీ పోర్న్ స్టార్‌గా మారారు. పోర్న్ స్టార్‌గా మారడం తన జీవితంలో చేసిన మంచి పని అని గ్రేసీ పేర్కొన్నారు. 30 ఏళ్ల ఇంటి రుణాన్ని (ఈఎంఐ) ఏడాదిలోనే చెల్లించగలిగానని గ్రేసీ గర్వంగా చెబుతున్నారు. అయితే గ్రేసీ నిర్ణయంతో వి8 సూపర్ కార్స్ అభిమానులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.

నా కల చెదిరిపోయే దశకు చేరుకుంది:
బ్రిస్బేన్‌లో జన్మించిన రెనీ గ్రేసీ ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కష్టసుఖాలను పంచుకున్నారు. తాను ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడానికే పోర్న్ స్టార్‌గా మారా అని, ఇప్పటివరకు తాను తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇది ఒకటని గ్రేసీ వెల్లడించారు. 'నేను కార్ రేసింగ్‌లో మంచి ఫలితాలతో పాటు డబ్బులు కూడా సంపాదించలేకపోయా. నా వంతు ప్రయత్నం చేశా. కానీ దాని ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో పాట. నా కల చెదిరిపోయే దశకు చేరుకుంది' అని రెనీ గ్రేసీ తెలిపారు.

ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా:
'నేను తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇది ఒకటి. ఈ నిర్ణయం నన్ను మంచి స్థితిలో ఉంచింది. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నా. ఎవరు నన్ను ఎలా పిలిచినా నేను స్వీకరిస్తా. ప్రస్తుతం నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నా. దాంతో చాలా సంతోషంగా జీవిస్తున్నా. నేను పోర్న్ రంగంలోకి ఊరికే వెళ్ళలేదు. ఇలా చేయడం వల్ల నన్ను చాలామంది అపార్థం చేసుకుంటారని నాకు తెలుసు. కానీ నేను చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం బయటకు వస్తుందని నాకు తెలుసు. అంతేకాకుండా ఇది చాలా వివాదాస్పదంగా మారుతుందని కూడా తెలుసు. అన్నింటికి సిద్ధంగా ఉన్నా' గ్రేసీ చెప్పారు.

5000 మందికి పైగా ఫాన్స్:
రెనీ గ్రేసీ ఇంటర్వ్యూ తర్వాత ఆమె సైట్‌కు అభిమానుల సంఖ్య 5000 మందికి పైగా పెరిగింది. తాను పోర్న్ రంగంలోకి అడుగుపెడుతున్నాననే విషయాన్ని గ్రేసీ గత వారం తెలిపారు. ఆమె తన వీడియోలను మరియు ఫొటోలను ఓన్లీఫ్యాన్స్.కామ్‌లో పెడుతున్నారు. మరోవైపు సూపర్ కార్స్ యాజమాన్యం ఈ విషయంపై స్పందిస్తూ... 'గ్రేసీ నిర్ణయం గురించి మాకు ముందే తెలుసు. ఇక నుంచి గ్రేసీకి, సూపర్ కార్స్ గేమ్‌కు ఎటువంటి సంబంధం లేదు' అని స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications