బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చీర్ గర్ల్స్‌కు ఆ జట్టు ఆటగాడు క్రిస్ గేల్ చుక్కలు చూపించాడు! క్రిస్ గేల్ ఇటీవల కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో (57 బంతుల్లో 117 పరుగులు) చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో చీర్ గర్ల్స్‌కు అదే పనిగా డ్యాన్స్ చేయడానికి చుక్కలు కనిపించాయట.
ఎంతో ఆనందంగా స్టేజీ పైన గంతులేసే ఈ చీర్ గర్ల్స్ బాధ ఎంతో ఆవేదనాభరితంగా ఉంటుంది. పంజాబ్‌తో గేల్ చెలరేగిన సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చీర్ గర్ల్స్‌కు ప్రాణం పోయినంత పని అయింది. వేడి నీళ్లు బకెట్‌లో కాళ్లు పెట్టుకొని సేద తీరవలసి వచ్చింది.

క్రిస్ గేల్‌తో పాటు మిగతా ఆటగాళ్లు డివిల్లియర్స్ వంటి వారు అదే పనిగా ఫోర్లు, సిక్స్‌లు కొట్టారు. దీంతో వారు పదేపదే చిందేయవలసి వచ్చింది.
ఆ తర్వాత పంజాబ్ జట్టు ఇన్నింగ్స్‌లోను వారికి ఈ కష్టాలు తప్పలేదు. బెంగళూరు ఆటగాళ్లు అదే పనిగా వికెట్లు తీశారు. దీంతో వారి కాళ్లు నొప్పులు పుట్టాయట. ఎంతగా నొప్పులు పుడుతున్నప్పటికీ.. గంతులేయడమే కాకుండా, మొహం పైన చిరునవ్వులు చిందించవలసి ఉంటుంది.