
విజేతకు టాయిలెట్ పేపర్:
ఒకవైపు కరోనా కలవరపెడుతున్నప్పటికీ అరిజోనా క్లబ్‌లో ఆరంభమైన ఈ లీగ్‌లో ముందస్తు జాగ్రత్తలతో పోటీలను నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అయితే కరోనా కారణంగా అమెరికాలో టాయిలెట్ పేపర్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మహిళల గోల్ఫ్ లీగ్‌లో విజేతకు నగదుతో పాటు టాయిలెట్ పేపర్ రోల్‌ను బహుమతిగా ఇస్తున్నారు.

ఆశ్చర్యం వ్యక్తం చేసిన సారా:
గతవారం జరిగిన పోటీల్లో సారా విజేతగా నిలిచింది. ఆమెకు 2,800 యుఎస్ డాలర్లతో పాటు టాయిలెట్ పేపర్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ బహుమతిపై సారా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 'గత వారం జరిగిన పోటీల్లో విజేతగా నిలిచాను. టాయిలెట్ పేపర్ బహుమతిగా ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. కోర్టులోని గుంతల్లో సబ్బు నురగను నింపుతున్నారు. దీని వల్ల బంతిని సురక్షితంగా తీసుకుంటున్నాం' అని ఈ సారా తెలిపింది.

అదనపు బహుమతి:
'అన్ని విధాలుగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సామాజిక దూరం పాటిస్తున్నాం. విజేతలకు కొన్ని టాయిలెట్ పేపర్లు ఇచ్చారు. విజేతలకు ఇవి అదనపు బహుమతి' అని సారా పేర్కొంది. కరోనా కారణంగా అన్ని క్రీడలు జరగట్లేదు. అయితే ఇక్కడ మాకు పోటీ పడే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. అమ్మాయిల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో నేను సంతోషించలేను, మరిన్ని తీసుకోవాలని కాక్టస్ టూర్ యజమాని మైక్ బ్రౌన్ గోల్ఫ్‌వీక్‌తో అన్నారు.


Click it and Unblock the Notifications












