Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

23 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలికిన ఒలింపిక్‌ ఛాంపియన్‌

Five-time Olympic champion Missy Franklin retires from professional swimming at the age of 23

హైదరాబాద్: ఐదుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌, అమెరికా స్టార్‌ స్విమ్మర్‌ మిస్సి ఫ్రాంక్లిన్‌ స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్రాంక్లిన్‌ కేవలం 23 ఏళ్లకే స్విమ్మింగ్‌‌కు వీడ్కోలు పలికింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో 17 ఏళ్ల వయసులో ప్రాంక్లిన్ నాలుగు వ్యక్తిగత స్వర్ణ పతకాలు గెలిచి సంచలనం సృష్టించింది.

చరిత్ర సృష్టించిన మిస్సి ప్రాంక్లిన్

చరిత్ర సృష్టించిన మిస్సి ప్రాంక్లిన్

తద్వారా ఒక ఒలింపిక్స్‌లో ఎక్కువ స్వర్ణాలు గెలిచిన అమెరికా మహిళగా మిస్సి ప్రాంక్లిన్ చరిత్ర సృష్టించింది. లండన్ ఒలింపిక్స్‌లో మిస్సి ప్రాంక్లిన్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 4x200మీటర్ల ఫ్రీ స్టైల్, 4x100మీటర్ల మెడ్లెలో స్వర్ణ పతకాలను సాధించింది. ఆ తర్వాత రియో ఒలింపిక్స్‌లో 4×200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో స్వర్ణం గెలిచింది.

2017లో రెండు భుజాలకు శస్త్రచికిత్స

2017లో రెండు భుజాలకు శస్త్రచికిత్స

అయితే, 2017లో రెండు భుజాలకు శస్త్రచికిత్స చేయించుకున్న మిస్సి ప్రాంక్లిన్ ఆ తర్వాత మళ్లీ బరిలో దిగలేదు. తన రిటైర్మెంట్ సందర్భంగా మిస్సి ప్రాంక్లిన్ మాట్లాడుతూ "ఆటకు వీడ్కోలు పలికే విషయాన్ని చెప్పేందుకు ఎక్కువ సమయం తీసుకున్నా, ఎప్పుడో నేను వీడ్కోలు పలికా. అయితే, ఇప్పుడు అందుకు సిద్ధంగా ఉన్నా" అని పేర్కొంది.

ప్రతి రోజు బాధపడేందుకు సిద్ధంగా లేను

ప్రతి రోజు బాధపడేందుకు సిద్ధంగా లేను

"ప్రతి రోజు బాధపడేందుకు నేను ఇప్పుడు సిద్ధంగా లేను. ఇప్పుడు భార్య అయ్యేందుకు, ఆ తర్వాత తల్లి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచేందుకు ప్రతి రోజూ నేను ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉంది. నా తదుపరి జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు సిద్ధంగా ఉన్నా" అని ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది.

Story first published: Friday, December 21, 2018, 12:26 [IST]
Other articles published on Dec 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+