Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ రికార్డు మిస్: మ్యాచ్ డ్రా

Sachin Tendulkar
బెంగుళూర్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో సచిన్ టెండూల్కర్ నాలుగో వికెట్‌గా అవుటయ్యాడు. దీంతో అతను బ్రియాన్ లారా అత్యధిక పరుగుల రికార్డును 15 పరుగుల తేడాతో మిస్సయ్యాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్సులో 430 పరుగులు చేసింది. కాగా, రెండో ఇన్నింగ్సులో ఆరు వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆనంతరం భారత్ రెండో ఇన్నింగ్సును ప్రారంభించింది. వెలుతురు సరిగా లేకపోవడంతో రెండు సార్లు ఆటను అంపైర్లు నిలిపేశారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఈ తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్సులో నాలుగు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. లక్ష్మణ్ 42 పరుగులతో, గంగూలీ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకు ముందు ఆస్ట్రేలియా విధించిన 299 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన భారత్ ఓపెనర్ సెహ్వాగ్ (6) వికెట్‌ను త్వరగా కోల్పోయింది. అలాగే ద్రవీడ్ (5) కూడా త్వరగా ఔట్ కావడంతో భారత శిభిరంలో ఆందోళన నెలకొంది. ఈ సమయంలో ఓపెనర్ గంభీర్‌కు జత కలిసిన సచిన్ భారత్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. ఈ దశలో గంభీర్ (29) సైతం పెవిలియన్ బాట పట్టాడు. అటుపై సచిన్‌కు జతకలిసిన వీవీఎస్ లక్ష్మణ్ సైతం నిదానంగా ఆడడం ప్రారంభించాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఈ దశలో సచిన్ (49) ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్ క్లిష్ట పరిస్థితుల్లో పడింది. అయితే గంగూలీ, లక్ష్మణ్ ఆ తర్వాత నిలకడగా ఆడారు.
Story first published: Monday, October 13, 2008, 17:21 [IST]
Other articles published on Oct 13, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+