Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శాశ్వత కోమాలోకి షుమాకర్?: ఆందోళనలో ఫ్యాన్స్

Michael Schumacher
ప్యారిస్: దిగ్గజ ఫార్ములావన్ రేసర్ మైకేల్ షుమాకర్ (45) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం కోమాలు ఉన్న అతను శాశ్వత కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బ్రిటన్, జర్మనీ దేశాలకు చెందిన మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అతని నిర్వాహకులు గానీ, కుటుంబ సభ్యులు గానీ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో డిసెంబర్ 29న స్కీయింగ్ చేస్తూ పడిపోయిన షూమాకర్ తలకు బలమైన గాయలు తగలడంతో కోమాలోకి వెళ్లాడు. అప్పట్నుంచి అతను ఆస్పత్రిలో కోమాలోనే ఉన్నాడు. కాగా షుమాకర్ శాశ్వత కోమాలోకి వెళతాడనే వార్తలతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

19 రోజులుగా కోమాలో ఉన్న మైకేల్ షుమాకర్ పరిస్థితి ఇంకా అలాగే ఉందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు తెలిపారు. అందుకోసమే గత కొన్ని రోజులుగా ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేయలేదని వారు చెప్పారు. మెదడుకు తీవ్ర గాయమైనందున షుమాకర్ జీవిత కాలంపాటు కోమాలోనే ఉండే అవకాశం ఉందని న్యూరోసర్జన్ ఆండ్రీస్ జియాగర్ తెలిపినట్లు జర్మన్ మీడియా ప్రకటించింది.

సాధారణంగా కోమాలోకి వెళ్లిన వ్యక్తులు వారం లేదా రెండు వారాల్లో మెలకువలోకి వస్తారని వైద్యులు తెలిపారు. మెదడులో ఎక్కువగా రక్తస్రావమైనందున కోమా నుంచి బయటపడటం చాలా కష్టమేనని జర్మన్ మీడియా తన కథనంలో వెల్లడించింది. ప్రమాదంలో అతను ధరించిన హెల్మెట్ కూడా రెండు ముక్కలైందని పేర్కొంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+