
ఫీల్ మిస్సవ్వకుండా ఉండటానికి
కరోనా వైరస్ మహమ్మారితో క్రీడాలోకం దాదాపు రెండు నెలలకు పైగా నిలిచిపోయింది. ఈ వారం వ్యవధిలోనే అక్కడక్క మ్యాచులు నిర్వహిస్తున్నారు. అయితే స్టేడియాల్లోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో.. క్రీడా నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం టీవీల్లో మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షించే వారికి ఫీల్ మిస్సవ్వకుండా ఉండటానికి.. ఎఫ్‌సి సియోల్ క్లబ్ స్టేడియాల్లో భారీగా అభిమానులు ఉన్నట్టు బొమ్మలతో నింపింది. అయితే ఆ బొమ్మలని సెక్స్ టాయ్స్‌ని తయారు చేసే ఓ సంస్థ సరఫరా చేసింది.

బొమ్మలను చూసి ప్రేక్షకులు షాక్
గ్వాంగ్‌జు ఎఫ్‌సీ-ఎఫ్‌సీ సియోల్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించిన ప్రేక్షకులు ఆ బొమ్మలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాటిలో కొన్ని సెక్స్ డాల్స్ కూడా ఉండటంతో.. అభిమానులు నిర్వాహకులపై మండిపడ్డారు. స్టేడియం స్టాండ్స్‌లో షోకేస్ బొమ్మలని పెట్టాలనుకున్నామని.. కానీ వాటిని ఉత్పత్తి చేసే సంస్థ చేసిన తప్పిదం వల్ల ఈ సమస్య వచ్చిందని ఎఫ్‌సి సియోల్ క్లబ్ తెలిపింది. బట్టల దుకాణాల్లో పెట్టే బొమ్మలకు బదులు సెక్స్ డాల్స్‌ను తెచ్చి.. వాటికి తమ జట్టు టీషర్టులు వేసి స్టేడియంలో పెట్టిందని పేర్కొంది.

రికార్డు స్థాయిలో జరిమానా
స్టేడియాల్లో ఉన్న ఆ బొమ్మలు ఎక్స్ రేటింగ్ ఉన్న వెబ్ సైట్‌లకి ప్రచారం కల్పిస్తున్నట్టుగా ఉన్నాయి. లైవ్‌లో మ్యాచ్ చూసిన అభిమానులు ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో ఎఫ్‌సి సియోల్ క్లబ్ తమ అభిమానులకి క్షమాపణ చెప్పింది. అయితే ఆ డాల్స్‌ను వాడి లీగ్ యొక్క ప్రతిష్ట, అభిమానుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఎఫ్‌సి సియోల్ క్లబ్‌కి కే లీగ్ రికార్డు స్థాయిలో 100 మిలియన్ ఓన్‌లను జరిమానాగా విధించింది.

ఖాళీ స్టేడియంలో మ్యాచ్‌లు:
ఫిబ్రవరిలో మొదలవ్వాల్సిన 2020 కే లీగ్ ఫుట్ బాల్ మ్యాచ్ కరోనా కారణంగా మే నెలలో ప్రారంభమైంది. దక్షిణ కొరియాలో ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే ముందే క్రీడలకి రంగం సిద్ధం అయింది. దీంతో మే 8వ తేదీన కే లీగ్ మొదలయింది. ఖాళీ స్టేడియం స్టాండ్లలలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఆటగాలు అందరూ ఫేస్ మాస్క్‌లు ధరించి, కరచాలనం చేయకూడదనే నియమం విధించారు. ఉమ్మి వేయడం, క్రీడాకారుల మధ్య సంభాషణల్ని కూడా నిషేధించారు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సియోల్ ఎఫ్‌సీ 1-0తో గ్వాంగ్‌ఝూపై విజయం సాధించింది. .


Click it and Unblock the Notifications
