ఒమన్ టీ-20 సిరీస్ డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకున్న ఫ్యాన్ కోడ్

ఒమన్ టీ ట్వంటీ సిరీస్‌కు ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ స్పోర్ట్స్ సంస్థ ఫ్యాన్ కోడ్ దక్కించుకుంది. భారత్‌లో ఈ టీట్వంటీ డిజిటల్ ప్రసార హక్కులను ఫ్యాన్‌కోడ్ దక్కించుకుంది.ఫిబ్రవరి 11 నుంచి ఈ నాలుగు దేశాల టీట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో ఐర్లాండ్, యూఏఈ, ఓమన్, నేపాల్ దేశాలు పాల్గొంటున్నాయి. ఫ్యాన్ కోడ్ యాప్ పై ఈ సిరీస్‌కు సంబంధించిన లైవ్ యాక్షన్ వీక్షించొచ్చు. అంతేకాదు www.fancode.com పై కూడా వీక్షించొచ్చు.
ఈ టోర్నీలో నాలుగు దేశాలైన ఓమన్, ఐర్లాండ్, నేపాల్, యూఏఈలు రౌండ్ రాబిన్ లీగ్‌లో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడతాయి. ఇందుకు ఒమన్‌లోని అల్ అమరాత్ లో ఉన్నఏఐ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా నిలుస్తోంది. టీట్వంటీ వరల్డ్‌కప్ గ్రూప్ ఏ క్వాలిఫైయర్ మ్యాచ్‌లకు ఇవి సన్నాహక మ్యాచ్‌లుగా ఉంటాయి. ఫిబ్రవరి 18న ఈ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి
గ్లోబల్ క్వాలిఫయర్స్‌లో మొత్తం 8 జట్లు తలపడతాయి. ఇందులో ఐర్లాండ్, యూఏఈ, జర్మనీ మరియు బహ్రెయిన్ దేశాలు గ్రూప్‌వన్‌లో ఉండగా... నేపాల్, ఓమన్, కెనడా, ఫిలిప్పీన్స్‌లు రెండవ గ్రూప్‌లో ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు వెళతాయి. ఇక ఫైనల్స్‌కు చేరే రెండు జట్లు అక్టోబర్‌లో జరిగే ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి.
ఒమన్ టీ-20 సిరీస్ లైవ్‌ను ఫ్యాన్ కోడ్ యాప్ లేదా www.fancode.com పై ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11:30 గంటల నుంచి వీక్షించొచ్చు. వేగవంతమైన స్కోరుతో పాటు మంచి ఇంటరాక్టివ్ లైవ్ స్ట్రీమింగ్ అనుభూతిని పొందొచ్చు. అంతేకాదు మ్యాచ్ తర్వాత మ్యాచ్‌కు ముందు విశ్లేషణలు కూడా ఉంటాయి.
ఫిబ్రవరి 11- ఐర్లాండ్ వర్సెస్ యూఏఈ (ఉదయం 11:30 గంటలకు)
ఫిబ్రవరి 11- ఒమన్ వర్సెస్ నేపాల్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
ఫిబ్రవరి 12 - నేపాల్ వర్సెస్ యూఏఈ (ఉదయం 11:30 గంటలకు)
ఫిబ్రవరి 12 - ఒమన్ వర్సెస్ ఐర్లాండ్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
ఫిబ్రవరి 14- ఒమన్ వర్సెస్ అరబ్ ఎమిరేట్స్ (ఉదయం 11:30 గంటలకు)
ఫిబ్రవరి 14- ఐర్లాండ్ వర్సెస్ నేపాల్ (మధ్యాహ్నం 3:30 గంటలకు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications