
హైదరాబాద్: ఫార్ములావన్ అనగానే రేసు అనగానే గుర్తుకు వచ్చేది.... డ్రైవర్లతో పాటు వారికి తోడుగా అటు ఇటూ నిల్చోని నవ్వులు చిందిస్తూ, ప్రేక్షకులను ఉత్సాహాపరిచే గ్రిడ్ గర్ల్స్. ఇన్నాళ్లూ ఫార్ములా వన్ అభిమానులను తమ అందచందాలతో అలరించిన గ్రిడ్ గర్ల్స్ ఇకపై కనిపించరు.
వచ్చే సీజన్ నుంచి వాళ్ల స్థానంలో చిన్నారులను డ్రైవర్లకు తోడుగా పంపనున్నారు. ఈ మేరకు ఫార్ములా వన్ అమెరికా ఓనర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రిడ్ గర్ల్స్ స్థానంలో గ్రాండ్ ఫిక్స్ ఈవెంట్లకు సైతం చిన్నారులే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు.

జూనియర్ సర్క్యూట్‌లో ఉన్న రేసర్లను తమ ఫేవరెట్ స్టార్ల పక్కన నిలబెట్టడం వల్ల వారికి స్ఫూర్తినిచ్చినట్లు అవుతుందని ఫార్ములావన్ ప్రతినిధి సీన్ బ్రాచెస్ చెప్పాడు. 'యువ రేసర్లకు ఇదో గొప్ప అవకాశం. తమకు ఇష్టమైన స్టార్ల పక్కన నిలబడడం వారికెంతో స్ఫూర్తినిచ్చే అంశం' అని సీన్ పేర్కొన్నాడు.
ఈ గ్రిడ్ కిడ్స్ స్కీమ్ మార్చి 25 నుంచి మెల్‌బోర్న్‌లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి నుంచి ప్రారంభం అవుతుందని ఇటీవలే ఫార్ములావన్ తెలిపింది. దీనిపై ఫార్ములావన్ ప్రెసిడెంట్ జీన్ టాడ్ మాట్లాడుతూ 'ఫార్ములావన్ అనేది మోటార్ స్పోర్ట్స్‌కే తలమానికం. జూనియర్ సిరిస్‌లో పాల్గొనే ప్రతి ఒక్క యంగ్ రేసర్‌కు తమకు ఇష్టమైన స్టార్ల కలుసుకునేందుకు ఇదొక గొప్ప అవకాశం' అని తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.