Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కంగారూలను తేలికగా తీసుకోవద్దు: ధోనీ

Mahendra Singh Dhoni
బెంగుళూర్: వచ్చే టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టును తేలికగా తీసుకోవద్దని భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన జట్టు సహచరులకు సూచించారు. మెక్ గ్రాత్, ఆడం గిల్ క్రిస్ట్ వంటి ఉద్ధండులు లేకున్నాఅస్ట్రేలియా జట్టే ఉత్తమమైందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారా, లేరా అనేది ప్రధానం కాదని, మిడిల్ లో బ్యాటింగ్ కు వెళ్లే ఆటగాళ్లు ఎలా ఆడుతారనేదే ముఖ్యమని ఆయన అన్నారు.

స్థిరంగా ఆడగలిగే జట్టు మాత్రమే విజయం సాధిస్తుందని ఆనయ చెప్పారు. ఏ మ్యాచుకా మ్యాచుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే భారత్ గెలుస్తుందని ఆయన చెప్పారు. నిరాశ చెందితే సరిగా ఆడే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. చిన్న స్వామి స్టేడియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉందని, ఆస్ట్రేలియాపై బాగా ఆడిన చరిత్ర భారత్ కు ఉందని, అయితే ఫీల్డ్ లో కొంత దూకుడు అవసరమని ఆయన అన్నారు.
Story first published: Wednesday, October 1, 2008, 17:00 [IST]
Other articles published on Oct 1, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+