Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Exclusive: ఆ క్షణంలో నడిస్తే చాలనుకున్నా: ఆసియా ఫాస్టెస్ట్ ఉమెన్ షాలిని

షాలిని సరస్వతి.. ఈమె క్రీడా ప్రపంచానికి సుపరిచితమే. దేశంలో మొదటి మహిళా బ్లేడ్ రన్నర్. చైనాలో జరిగిన ఆసియా పారా గేమ్స్-2023లో భారత్ తరఫున బరిలోకి దిగింది. టీ62 విభాగంలో ఆసియాలో వేగవంతమైన మహిళగా రికార్డు నెలకొల్పింది. షాలిని బ్లేడ్ రన్నరే కాకుండా మారథానర్, పబ్లిక్ స్పీకర్, మోటివేటర్, బ్లాగర్. అంతేగాక ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్‌లో డైరక్టర్.

అయితే 2012లో షాలిని జీవితం తలకిందులైంది. విహారయాత్రకు వెళ్లిన ఆమె కంబోడియా నుంచి తిరిగివస్తుండగా రికెట్సియా అనే అరుదైన బ్యాక్టీరియా వ్యాధి సోకింది. ఆ సమయంలో ఆమె గర్భవతి. తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో షాలిని కొన్ని నెలల పాటు ఐసీయూలోనే ఉంది. దురదృష్టవశాత్తు ఇన్‌ఫెక్షన్ కారణంగా బిడ్డతో పాటు తన చేతులు, కాళ్లు కోల్పోయింది.

Exclusive Asia s Fastest Woman on Blades Shalini Saraswathi India s Disability Support Has a Long Way to Go

షాలిని బాధతో అక్కడే ఆగిపోలేదు. మనోధైర్యంతో ముందుకు సాగింది. తన కోచ్ బీపీ అయ్యప్పతో కలిసి మారథాన్‌కు సన్నద్ధమైంది. 2017లో పది కిలోమీటర్ల పరుగును గంట 35 నిమిషాల్లో ముగించింది. ఆ తర్వాత జాతీయ పారా క్రీడల్లో 100 మీటర్ల పరుగులో 2021లో స్వర్ణం, 2022లో రజతం సాధించింది. కాగా, షాలిని సరస్వతి మైకేల్‌తో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఆసియా పారా గేమ్స్-2023 అనుభవం గురించి...
ఏషియన్ గేమ్స్ అనుభవం ఎంతో గొప్పగా ఉంది. క్రీడా నేపథ్యం నుంచి కాకుండా వచ్చిన నాకు ఎంతో స్పెషల్‌గా అనిపించింది. వైకల్యం తర్వాత నేను క్రీడల్లోకి వచ్చాను. నేను ఇలా మెగా వేదికపై పోటీపడతానని అనుకోలేదు. కానీ ఆ సంఘటన తర్వాత నేను ఈ స్థాయికి చేరి దేశం తరఫున ఎన్నో దేశాల అథ్లెట్లతో పోటీపడటం అద్భుతంగా ఉంది.

ఆ క్షణంలో నడిస్తే చాలనకున్నా
2014లో బెంగళూరులోని కంటీరవా స్టేడియానికి తొలిసారి వెళ్లాను. ప్రొస్థిటిక్ లెగ్స్‌తో ఉన్నాను. కోచ్ అయ్యప్పను కలిసినప్పుడు రన్నింగ్ గురించి ఆలోచన ఏం లేదు. తిరిగి నడిస్తే చాలనుకున్నా. ఆ తర్వాత క్రమంగా రన్నింగ్‌ చేశాను. 2016, 2017 టీసీఎస్ రన్‌లో పాల్గొన్నాను. అనంతరం ప్రొఫెషనల్‌గా పోటీపడదామని నా కోచ్ చెప్పాడు.ఆ తర్వాత మేం బ్లేడ్స్ గురించి ఎంతో రీసెర్చ్ చేశాం. తీవ్రంగా శ్రమించాం. తొమ్మిదేళ్లు శ్రమించి ఆసియన్ గేమ్స్‌కు వెళ్లాను.

దేశంలో మద్దతు పెరగాలి
సాధారణ అథ్లెట్లతో పోలిస్తే దేశానికి పారా అథ్లెట్లే ఎక్కువ పతకాలు సాధించి పెడుతున్నారు. దివ్యాంగాలు కోసం రూపొందించిన విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో భారత్ వెనుకంజలోనే ఉంది. మౌలిక సదుపాయాల పరంగా చాలా దూరంలో ఉన్నాం. వైకల్యంతో ఉన్న వాళ్లు బస్సు, కార్లలో సౌకర్యంగా ప్రయాణించలేరు. గమ్య స్థానాలను చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.

ఇష్టమైనవి
బెంగళూరులో పారడైజ్, కొరమంగళలో ఉన్న చైనా పెర్ల్, లావెల్లి నా ఫేవరేట్ రెస్టార్లెంట్లు. ఇక లేట్ నైట్‌లో ఔటర్ రింగ్ రోడ్ వెంట కార్ డ్రైవింగ్, అక్కడ టీ తాగడం ఇష్టం.

Story first published: Friday, August 30, 2024, 17:03 [IST]
Other articles published on Aug 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+