కుర్చీతో కొట్టారు: రెజ్లర్ ఖలీ తలకు బలమైన గాయం
డెహ్రాడూన్: ప్రపంచ ప్రఖ్యాత మాజీ డబ్లూడబ్లూఈ రెజ్లర్ ఖలీ బుధవారం రాత్రి మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరుగుతున్న 'ది గ్రేట్ ఖలీ రిటర్న్స్' షోలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో అతడి తలకు బలమైన గాయమైంది. మొత్తం ముగ్గురు కెనడాకు చెందిన రెజ్లర్లు ఖలీని కుర్చీతో కొట్టడమే కాక బలంగా పంచ్‌లివ్వడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో వెంటనే అతన్ని డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తల గాయానికి వైద్యులు ఏడు కుట్లు వేశారు. ఛాతి గాయాలకు సంబంధించి పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఖలీ డబ్లూడబ్లూఈ ప్రపంచ హెవీవేయిట్ ఛాంపియన్‌గా అవతరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 7.1 అడుగుల ఎత్తు ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications