కర్లింగ్ గేమ్‌తో వింటర్ ఒలింపిక్స్ ఆరంభం: పైకప్పు లేని జాతీయ స్టేడియం, ఎముకలు కొరికే చలి
హైదరాబాద్: 23వ వింటర్స్ ఒలింపిక్స్‌కు దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్ నగరం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9 నుంచి 25 వరకూ జరిగే ఈ వింటర్ ఒలింపిక్స్‌లో 92 దేశాలకు చెందిన 3వేల మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. ఒలింపిక్స్ గేమ్స్‌లో భాగంగా గురువారం మిక్స్‌డ్ డబుల్స్‌లో కర్లింగ్ స్టోన్ పోటీతో పోటీలను ఆరంభించారు.
వాస్తవానికి అధికారికంగా ఈ గేమ్స్ శుక్రవారం ప్రారంభం కావల్సి ఉంది. కానీ గ్యాంగ్‌నియంగ్ కర్లింగ్ సెంటర్‌లో రౌండ్ రాబిన్ మ్యాచ్‌తో పోటీలను ప్రారంభించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫిన్‌లాండ్‌కు చెందిన ఊనా కౌస్టే-టామ్ రత్నామైకీ, మరోవైపు కెనడా-నార్వే, స్విట్జర్లాండ్-రష్యా అథ్లెట్లు తలపడ్డారు.

రాత్రి 8 గంటలకు వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలు
స్థానిక కాలమానం ప్రకారం వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ ఉత్సవాలు రాత్రి 8 గంటలకు మొదలవుతాయి. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు జరిగే ప్యాంగ్ చాంగ్ జాతీయ స్టేడియానికి పైకప్పు లేకపోవడంతో ఎముకలు కొరికే చలిలో, విపరీతమైన చలిగాలులను తట్టుకుంటూ వివిధ జట్ల కవాతును, సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించడం ప్రేక్షకులకు సవాల్‌గా మారింది.

చలి తీవ్రత సమస్యలను సృష్టించడం ఖాయం
30 ఏళ్ల తర్వాత ప్యాంగ్ చాంగ్‌లో జరుగుతోన్న ఈ వింటర్ ఒలింపిక్స్‌కు అడుగడుగునా చలి తీవ్రత సమస్యలను సృష్టించడం ఖాయంగా అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత -25 డిగ్రీల సెల్సియస్. ఇది మరింత పెరిగి -35 వరకూ చేరే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

మధ్యాహ్నం సమయాల్లో పరిస్థితి కొంత మెరుగు
అయితే మధ్యాహ్నం సమయాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని వింటర్ ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఓసీ) అధికారులు చెబుతున్నారు. నార్వేలోని లిలెహామర్‌లో జరిగిన 1994 వింటర్ ఒలింపిక్స్ సమయంలో -10 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. ఇప్పటి వరకూ ఈ పోటీల్లో అదే అత్యల్పం.

ఆ రికార్డుని ప్యాంగ్ చాంగ్ అధిగమిస్తుంది
అయితే ఇప్పుడు ప్యాంగ్ చాంగ్ ఆ రికార్డుని అధిగమిస్తుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. సముద్ర మట్టానికి 2,460 అడుగుల ఎత్తులో ఉండే ప్యాంగ్ చాంగ్ నగరం దక్షిణ కొరియాలోనే అతి చల్లని ప్రాంతం. చలితోపాటు చలిగాలులు కూడా వీస్తుంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వరకూ ఎవరూ బయట తిరిగే పరిస్థితి ఉండదు.

ప్రసార హక్కులను జియో టీవీ
భారత్‌లో జియో టీవీలో వింటర్ ఒలింపిక్స్ ప్రత్యక్ష ప్రసారం
ప్యాంగ్ చాంగ్ నగరంలో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న వింటర్ ఒలింపిక్ గేమ్స్ ప్రసార హక్కులను జియో టీవీ దక్కించుకుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో జియో టీవీ కలసి పనిచేయడం ద్వారా ఈ ప్రసారాలను దక్కించుకుంది. అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓసీ) తన వెబ్‌సైట్ ద్వారా ఒలింపిక్ చానెల్‌లో, యూట్యూబ్ ఛానెల్‌లో కూడా క్రీడలను ప్రసారం చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications