Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించేందుకే క్రికెట్: కపిల్

Kapil Dev
సౌతాంప్టన్: ఇండియాకి మొట్టమొదటి ప్రపంచ కప్ తెచ్చి తనకంటూ చరిత్రలో ఓ సుస్దిర స్దానాన్ని సంపాదించుకున్నారు ఆల్ రౌండర్ కెప్టెన్ కపిల్ దేవ్. ఇటీవల కాలంలో టీమిండియా ఆటగాళ్లు ఎక్కువ మంది గాయాలు పాలవ్వడంతో ఆటగాళ్లకు తగు సూచలను చేస్తూ, గాయాలు పాలవ్వకుండా ఉండాలంటే ఏమేమి చేయాలో ఓప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ క్రింది విధంగా స్పందించారు. ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కొసమే క్రికెట్‌ని ఆడడం జరుగుతుంది. దీనిని నేను నెగిటివ్‌గా చెప్పడం లేదు. ఒక్క నెలలో ఎంత డబ్బు సంపాదించగలమో అంతే డబ్బు మాత్రమే సంపాదించవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు ఫిట్‌గా ఉన్నప్పడు మాత్రమే బాగా ఫెర్పామ్ చేయగలరని ఇంటర్యూలో ఈతరం కుర్ర ఆటగాళ్లకు తెలియజేశారు.

దీనితో పాటు భారత ప్రధాన పేసర్ జహీర్‌ఖాన్ గాయాలు ఆందోళనకరమని విఖ్యాత ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ అన్నారు. ఈ వయసులో గాయాలు కెరీర్‌కే ముప్పుగా మారతాయన్నారు. ప్రస్తుతం 32 ఏళ్ల వయసున్న జహీర్ మళ్లీ బరిలోకి దిగాలనుకుంటే ఎక్కువ శ్రమించాలని సూచించారు. లేదంటే కొన్ని మ్యాచ్‌లకే అవి తిరగబెడతాయని హెచ్చరించారు. కెరీర్‌లో 131 టెస్టులాడిన కపిల్ 434 వికెట్లతో అప్పట్లో రికార్డు సృష్టించాడు. విశేషమేమిటంటే గాయంతో ఆయన ఒక్క టెస్టుకూ దూరం కాలేదు. అడపాదడపా గాయాలైనా అవన్నీ ఆఫ్ సీజన్‌లోనే అయ్యాయి. గత 15 ఏళ్లుగా ఎంతో మంది పేసర్లు వెలుగులోకి వచ్చినా వారంతా ఏదో ఒక గాయంతో సతమతమవడం దురదృష్టకరమన్నారు. మన బౌలర్ల కసరత్తుల్లోనే లోపాలున్నాయని, ట్రెయినింగ్ సెషన్‌ను బౌలర్లు స్వల్ప శ్రమతో నెట్టుకొస్తున్నారని కపిల్ విమర్శించారు. నెట్స్‌తో పాటు జిమ్‌లోనూ ఎక్సర్‌సైజ్‌లు చేయాలని సూచించారు.

పైకి చూడ్డానికి బాగానే ఉన్నా కాళ్ల భాగానికి వచ్చే సరికి బలహీనంగా కనిపిస్తున్నారని, కాళ్లకు, కండరాలకు బలాన్నిచ్చే రన్నింగ్ చేయాలని చెప్పారు. 'డ్రెస్సింగ్ రూమ్‌లోనో, కంప్యూటర్ ముం దు కూర్చుంటేనో గొప్ప క్రికెటర్ కాలేమన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్రాథమికాంశాలకు కట్టుబడి మైదానంలో చెమటోడిస్తేనే రాణిస్తారు" అని కపిల్ అన్నారు. సచిన్ విషయాన్ని ప్రస్తావిస్తూ... 'అతని కేసు వేరు, జహీర్ కేసు వేరు. ఇంకా చెప్పాలంటే బ్యాట్స్‌మన్ శైలే వేరు. ఇప్పుడు కూడా సచిన్ కావాలనుకుంటే మళ్లీ బరిలోకి దిగగలడు. ఇప్పటికే అతను చేయాల్సినవన్నీ చేసేశాడు. ఇంకా తన కెరీర్‌లో వందో సెంచరీ తప్ప చేయాల్సిందేమీ మిగల్లేదు" అని అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+