Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రికార్డ్: ఫ్రాన్స్‌కు షాక్-యూరో కప్ పోర్చుగల్ కైవసం

ప్యారిస్: యూరో కప్‌లో పోర్చుగల్‌ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఎడర్ అద్భుత్ గోల్‌తో యూరో కప్‌-2016 విజేతగా నిలిచింది. ఆతిథ్య ఫ్రాన్స్‌ జట్టుతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 1-0 గోల్స్‌ తేడాతో విజయం సాధించి తొలిసారి యూరోకప్‌ను కైవసం చేసుకుంది.

నిర్ణీత సమయంలో ఇరుజట్లు హోరాహోరీగా పోరాడినప్పటికీ గోల్‌ సాధించడంలో విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్‌ అదనపు సమయానికి దారితీసింది. ఫ్రాన్స్‌ ఆటగాడు ఢీకొనడంతో పోర్చుగల్‌ స్టార్‌ ఆటగాడు రొనాల్డో మోకాలికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాల్సివచ్చింది.

euro cuipwin

అదనపు సమయంలో 109వ నిమిషంలో ఎడర్‌ దాదాపు 25 యార్డుల దూరం నుంచి బంతిని నేరుగా గోల్‌పోస్టులోకి పంపడం ద్వారా మరుపురాని గోల్‌ సాధించాడు. దీంతో పోర్చుగల్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

విజయం సాధించిన అనంతరం పోర్చుగల్‌ అభిమానులు స్టేడియం లోపల, బయట సంబరాలతో హోరెత్తించారు. ఓటమి విషాదంతో ఫ్రాన్స్‌ ఆటగాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు. సుమారు 41ఏళ్ల తర్వాత పోర్చుగల్ యూరో కప్‌‌లో ఫ్రాన్స్‌ను ఓడించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+