For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్విట్టర్‌లో పందెం ఓడి అభిమానితో డేటింగ్‌కెళ్లిన టెన్నిస్ భామ

ఓ సూప‌ర్ బౌల్ మ్యాచ్‌పై బెట్ క‌ట్టి ఓడిపోయిన యుజిని బౌచర్డ్‌, ఎవరో తెలియని ఓ అభిమానితో ఏకంగా డేట్‌కు వెళ్లింది. సూపర్‌ బౌల్‌ సిరీస్‌లో జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అట్లాంటాయే గెలుస్తుంద‌ని ఆమె ట్వీట్ చ

By Nageshwara Rao

హైదరాబాద్: కెన‌డా టెన్నిస్ స్టార్ యుజిని బౌచర్డ్‌ ఆట కన్నా అందంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ మూడో రౌండ్లోనే వెనుదిరిగిన యుజిని బౌచర్డ్‌ పెద్ద‌గా వార్త‌ల్లోకెక్క‌లేదు గానీ, మ‌రో కార‌ణంగా బౌచ‌ర్డ్ వార్త‌ల్లో నిలిచింది.

ఓ సూప‌ర్ బౌల్ మ్యాచ్‌పై బెట్ క‌ట్టి ఓడిపోయిన యుజిని బౌచర్డ్‌, ఎవరో తెలియని ఓ అభిమానితో ఏకంగా డేట్‌కు వెళ్లింది. సూపర్‌ బౌల్‌ సిరీస్‌లోని అట్లాంటా ఫాల్కన్స్‌- న్యూఇంగ్లాండ్‌ పేట్రియాట్స్‌ జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అట్లాంటాయే గెలుస్తుంద‌ని ఆమె ట్వీట్ చేసింది.

Eugenie Bouchard has a romantic date with stranger after losing bet

ఆమె ఈ ట్వీట్ చేసిన సమయానికి అట్లాంటా జట్టు 21-0తో ముందంజలో ఉంది. ఆ ధీమాతోనే అట్లాంటా గెలుపు ఇక లాంచ‌న‌మే అన్న‌ట్లు బౌచ‌ర్డ్ ట్వీట్ చేసింది. అట్లాంటా గెలుస్తుంద‌ని నాకు తెలుసు.. భ‌విష్య‌త్తును ముందే అంచ‌నా వేశా! అని ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

దీనిపై ఓ అభిమాని స్పందించాడు. ఒక‌వేళ పేట్రియాట్స్‌ జట్టు గెలిస్తే నాతో డేట్‌కు వస్తావా అని అత‌ను ట్వీట్ చేశాడు. క‌చ్చితంగా అంటూ బౌచ‌ర్డ్ అని సమాధానమిచ్చింది.

ఆటలో భాగంగా సెకండాఫ్‌లో అనూహ్యంగా పుంజుకున్న ప్యాట్రియాట్స్ 34-28 తేడాతో గెలిచింది. దీంతో ఆ అభిమాని 'ఆందోళన పడుతున్నారా?' అంటూ ట్వీట్‌ చేశాడు. 'అవును.. కొంచెం..' అని సమాధానమిచ్చి 'నువ్వు ఎక్కడ ఉంటావ్‌?' అని బౌచర్డ్‌ అడిగింది.

చెప్పిన ప్రకారం తాను పందెంలో ఓడిపోవడంతో బౌచర్డ్‌ మాట నిలబెట్టుకుంది కూడా. ఈ విషయాన్నే ఆమె స్వయంగా మళ్లీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. తర్వాత తాను అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని డేట్‌ తర్వాత ట్వీట్‌ చేసింది.

అలాగే టామ్‌ బ్రాడీకి వ్యతిరేకంగా ఎప్పుడూ బెట్‌ వేయొద్దని గొప్ప గుణపాఠం కూడా నేర్చుకున్నానంటూ బౌచర్డ్‌ మరో ట్వీట్‌ ద్వారా తెలిపింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+