Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాంకర్ 'నగ్నవీడియో' కేసు: నష్టపరిహారంగా రూ.370 కోట్లు

న్యూయార్క్: అమెరికాలోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న మారియట్‌ నేష్‌విల్లే హోటల్‌‌ గదిలో తాను దుస్తులు మార్చుకుంటుండగా డేవిడ్ బ్యారెట్‌ అనే వ్యక్తి రహస్యంగా వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టడంపై న్యాయపోరాటానికి దిగిన అమెరికా స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ ఎరిన్ ఆండ్రూస్‌కు గొప్ప ఊరట లభించింది.

అమెరికా స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్ యాంకరైన ఎరిన్‌ను వీడియో తీయడమేకాక, సోషల్ నెట్ వర్క్‌లో పోస్ట్ చేసి ఆమెను మానసిక క్షోభకు గురిచేశారంటూ ప్రతివాదులపై కోర్టు మండిపడింది. అంతేకాదు నష్టపరిహారంగా ఎరిన్‌కు 55 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.370 కోట్లు) చెల్లించాలని తీర్పుచెప్పింది.

ఎరిన్‌కు చెల్లించాల్సిన జరిమానాను ప్రధాన దోషి అయిన మైకేల్ డేవిడ్, రెండో దోషి మారియట్ హోటల్ గ్రూపులు చెరిసగం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కాగా, హోటల్ నిర్వహణను రెండు కంపెనీలు చూస్తున్నందున ఆ రెండూ ఎంతెంత శాతం చెల్లించాలనే నిర్ణయాన్ని వారికే వదిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

Erin Andrews Awarded $55 Million in Lawsuit Over Nude Video at Hotel

సోమవారం తన తల్లిదండ్రులతో కలిసి కోర్టుకు హాజరైన ఎరిన్ న్యాయమూర్తి తీర్పు అనంతరం కాస్తంత ఊరటచెందారు. గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసులో ఎట్టకేలకు ఎరిన్ గెలుపొందడంతో కోర్టు ఆవరణలో ఉన్న తన అభిమానులకు ఆటోగ్రాఫులిచ్చారు.

2008లో ఈఎస్‌పీఎన్ చానెల్‌కు పనిచేస్తున్నప్పుడు ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను కవర్ చేయడం కోసం ఎరిన్ అమెరికాలోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ సమీపంలోని మారియట్ నేష్‌విల్లే హోటల్‌లో బసచేసింది. పక్క గదిలోనే బసచేసిన మైకేల్ డేవిడ్ బారెట్ అనే వ్యక్తి ఎరిన్ గదిలోకి రంధ్రం చేసి.. ఆమె డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టాడు.

ఆ వీడియోని ప్రపంచ వ్యాప్తంగా 17 మిలియన్ల చూశారు. దీంతో తన ప్రమేయం లేకుండా తన నగ్న వీడియోని తీసి ఇంటర్నెట్‌లో పెట్టేందుకు సహకరించిన మారియట్ నేష్‌విల్లే హోటల్‌పై ఆమె పరువు నష్టం దావా వేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

అయితే ఈ వీడియో తర్వాత ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవడంతో పబ్లిసిటీ కోసం ఎరినే స్వయంగా ఈపని చేసిందంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టాడని తెలిసినప్పుడు తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపింది. తీవ్ర అవమానంతో కుంగిపోయానని కన్నీటి పర్యంతమవుతూ కోర్టులో తన వాంగ్మూలాన్ని తెలియజేసిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+