Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

20 ఏళ్ల తర్వాత ఈక్వెస్ట్రియన్‌లో ఒలింపిక్స్ అర్హత సాధించిన భారత్

Equestrian Fouaad Mirza seals Tokyo Olympic berth, ends nearly 20 year wait for India

హైదరాబాద్: ఈక్వెస్ట్రియన్‌లో సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. భారత్‌ రైడర్‌ ఫౌవాద్‌ మీర్జా ఈక్వెస్ట్రియన్‌‌లో ఒలింపిక్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒక భారత రైడర్‌ ఈక్వెస్ట్రియన్‌‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం విశేషం.

నవంబర్ మొదటి వారంలో జరిగిన ఆగ్నేయా ఆసియా, ఓషియానియా క్వాలిఫయింగ్‌ జోన్‌ గ్రూపు-జీలో వ్యక్తిగత విభాగంలో 27 ఏళ్ల ఫౌద్‌ మీర్జా టాప్‌ ర్యాంకర్‌గా నిలువడంతో అతనికి టోక్యో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఈవెంటింగ్‌ కేటగిరీలో పాల్గొనే అవకాశం దక్కనుంది. ఇంతియాజ్ అనీస్, ఐజే లాంబా తర్వాత ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బరిలోకి దిగుతున్న మూడో ఈక్వెస్ట్రియన్‌గా ఫవాద్ నిలిచాడు.

ఫౌవాద్‌ కన్నా ముందు భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో ఇంతియాజ్‌ (2000-సిడ్నీ), ఐజే లాంబా (1996-అట్లాంటా) మాత్రమే ఈక్వెస్ట్రియన్‌లో ప్రాతినిధ్యం వహించారు. కాగా, అంతర్జాతీయ ఈక్వెస్ట్రియన్ సమాఖ్య (ఎఫ్‌ఈఐ) వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 తేదీన అధికారికంగా బెర్తులు ప్రకటించనుంది.

Story first published: Saturday, November 23, 2019, 8:08 [IST]
Other articles published on Nov 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+