అబుదబీ: ప్రపంచ కప్ నుండి తనను తొలగించడం తప్పని ఇప్పుడు సెలక్టర్లకు తెలిసి వచ్చి ఉంటుందని ఇంగ్లాండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ బుధవారం అన్నాడు. ప్రపంచ కప్ నుండి గ్రూప్ దశలోనే ఇంగ్లాండ్ ఇంటి దారి పట్టింది. దీని పైన అలిస్టర్ కుక్ అబుదబీలో స్పందించాడు.
ఇంగ్లాండ్ ఆదిలోనే ఇంటి దారి పట్టడం గురించి తాను లోతుగా మాట్లాడదల్చుకోలేదని చెప్పాడు. అయితే, తనకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంగ్లీష్ క్రికెట్‌కు ఏది మంచిదిగా భావించారో అది వారు చేశారని.. తనను తొలగించిన విషయంపై వ్యాఖ్యానించాడు.

అయితే, వారు తీసుకున్న నిర్ణయం తప్పని తేలిందన్నాడు. ఇంగ్లాండ్ టీం ఇంటి దారి పట్టడం ద్వారా తన పైన సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం సరికాదని తెలిసి వచ్చిందన్నాడు.
గత ఏడాది డిసెంబర్ నెలలో కుక్ స్థానంలో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్సుమెన్ ఇయాన్ మోర్గాన్‌ను తీసుకున్నారు. ప్రపంచ కప్‌కు రెండు మూడు నెలల ముందు ఇది జరిగింది. ప్రపంచ కప్‌లో గ్రూప్ ఏలో ఉన్న ఇంగ్లాండ్.. న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల చేతిలో ఓడి.. ఆ గ్రూప్‌లో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో అది క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.