ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ విజయం: ఇంగ్లాండ్ ఇంటికి.. క్వార్టర్స్‌కు బంగ్లా
అడిలైడ్: క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్ ప్రపంచ కప్ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవని ఇంగ్లాండ్.. మరోసారి కూడా ఆ అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అడిలైడ్ మైదానంలో సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. దీంతో బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు క్వార్టర్స్‌లో ప్రవేశించగా, ఇంగ్లాండ్ జట్టు ఇంటి బాటపట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేయగా లక్ష్యఛేదనలో తడబడిన ఇంగ్లాండ్ 48.3 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. ఐదు మ్యాచులాడిన ఇంగ్లాండ్ ఓ మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.

కాగా, బంగ్లాదేశ్ 7 పాయింట్లతో (3 విజయాలు, వర్షంతో ఓ మ్యాచ్ రద్దు) గ్రూపు-ఏలో మూడో స్థానంలో నిలిచింది. 276 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్.. 48.3 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. ఇయాన్ బెల్ (63) హాఫ్ సెంచరీ చేశాడు. ఇతర టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. చివర్లో బట్లర్, వోక్స పోరాడినా ఫలితం లేకపోయింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. మహ్మదుల్లా(103) సెంచరీ, ముష్ఫికర్(89) అర్ధసెంచరీలతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్ 15 పరుగుల తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌లో స్థానం సంపాదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications