For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌పై విజయం యాషెస్ గెలుపు లాంటిదే: ఆండీ

By Nageswara Rao
Andy Flower
లండన్‌: ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న భారత్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లాండ్‌ ఆ విజయాన్ని 2009 యాషెస్‌ సీరీస్‌తో సమానమైనదిగా పరిగణించింది. రెండు సంవత్సరాల క్రితం ఓవల్‌ గ్రౌండ్‌లోనే ఇంగ్లాండ్‌ ఆసీస్‌ను చిత్తు చేసింది. ఇపుడు అదే గ్రౌండ్‌లో భారత్‌ను వైట్‌వాష్‌ చేసింది. దీనిపై ఇంగ్లాండ్‌ కోచ్‌ ఆండీఫ్లవర్‌ స్పందిస్తూ... ' ఈ విజయం మాకు ఎంతో సంతోషానిచ్చింది. 2009లో జరిగిన యాషెస్‌సీరీస్‌లో ఆసీస్‌ను ఎలానైతే మట్టికరిపించామో అదే రీతిలో భారత్‌ను కూడా చిత్తు చేశాం. ఆసీస్‌పై 3-0 విజయాన్ని నమోదు చేస్తే ఈ సీరీస్‌లో టీమిండియాపై 4-0తో గెలుపొందాము." అని ఆండీ పేర్కొన్నాడు.

ఈ విజయం కూడా నాకు యాషెస్‌ లాంటిదే. ఓవల్‌ స్టేడియంలోనే ఆసీస్‌పై ఇంగ్లాండ్‌ విజయభేరి మోగించింది. ఇపుడు భారత్‌ను కూడా ఇదే గ్రౌండ్‌లో ఓడించి కప్పు గెలుపొందటం ఆనందంగా ఉందని ఫ్లవర్‌ తెలిపాడు. ఇంగ్లాండ్‌కు యాషెస్‌ సీరీస్‌ ఎంతో విలువైనది. దానికి ఎన్నో వ్యక్తిగత కారణాలున్నాయి. అయితే భారత్‌తో ఆడటం కూడా ఇంగ్లాండ్‌కు విశేషమని ఆండీ అన్నాడు. స్ట్రాస్‌ నాయకత్వం, ఆటగాళ్ల ఫామ్‌, అలాగే బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాహమ్‌ గూచ్‌ సలహాలు మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. స్టాఫ్‌, ఇంగ్లాండ్‌ అభిమానుల మద్దతుతో ఈ విజయాన్ని నమోదు చేశామని ఆండీ పేర్కొన్నాడు. ఓవల్‌లో భారత్‌ను ఓడించి సీరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్‌ ఓకే సీరీస్‌లో భారత్‌ను రెండు సార్లు ఇన్సింగ్‌ తేడాతో ఓడించిన ఘనతను సొంతం చేసుకున్నది.

టీమిండియాను వైట్‌వాష్‌ చేయాటానికి ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ తెలిపాడు. 4-0తేడాతో భారత్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడానికి ఇంగ్లాండ్‌ సీరీస్‌కు ముందే ఎన్నో వ్యూహరచనలను చేసిందని బ్రాడ్‌ అన్నాడు. భారత్‌ను వైట్‌వాష్‌ చేయడంతో పాటూ...టెస్టుల్లో నంబర్‌వన్‌ హోదాను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్‌ ఈ స్థానాన్ని చేరుకునేందుకు కోచ్‌ ఆండీ ఫ్లవర్‌, కెప్టన్‌ స్ట్రాస్‌ పాత్ర ఉందని స్టువర్ట్‌ పేర్కొన్నాడు. ' మేమందరం కలసి కట్టుగా ఆడాం. స్వాన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. సీరీస్‌ అంతా కూడా మేము విశేషంగా రాణించాం." అని బ్రాడ్‌ చెప్పాడు. భారత్‌ పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌తో ఉన్నది. వన్డే ప్రపంచకప్‌ విజేతతో పోటీ పడి విజయం సాధించటం సంతోషం కలిగించే విషయమని స్ట్రాస్‌ తెలిపాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+