ముంబయి: భారత్,ఇంగ్లండ్‌ల మధ్య జరగనున్న రెండు టెస్ట్ సీరీస్‌కు ఇంగ్లండ్ బోర్డు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ సీరీస్‌పై సందిగ్ధం తొలిగింది. మొదటి టెస్టు ఈనెల 11నుంచి చెన్నైలో, రెండవ టెస్ట్ 19నుంచి మొహాలీలో జరగనుంది. గత షెడ్యూలు ప్రకారం ఈనెల 5నుంచి జరగవలసిన ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రం రద్దయింది. ముంబయి పేలుళ్ల నేపథ్యంలో వన్డే సీరీస్ అర్థంతరంగా రద్దయిన విషయం విదితమే.