న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెర్లిన్ మారథాన్‌: ప్రపంచ రికార్డు నెలకొల్పిన కెన్యా అథ్లెట్‌

Eliud Kipchoge smashes world marathon record by 78 seconds in Berlin

హైదరాబాద్: బెర్లిన్ వేదికగా జరిగిన పురుషుల మారథాన్‌లో కెన్యా స్టార్‌ అథ్లెట్‌, రియో ఒలింపిక్‌ ఛాంపియన్ ఎలియుడ్‌ కిప్‌చోగె ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ఆదివారం జరిగిన బెర్లిన్‌ మారథాన్‌లో 33 ఏళ్ల ఎలియుడ్‌ కిప్‌చోగె ఈ ఘనత సాధించాడు.

ఈ మారథాన్‌ రేసును 2 గంటల 1 నిమిషం 39 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. రియో ఒలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గిన కిప్‌చోగె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల ఒక నిమిషం 39 సెకన్లలో పూర్తి చేశాడు. ఫలితంగా మారథాన్ ఈవెంట్‌లో సరికొత్త రికార్డుని నెలకొల్పాడు.

2014లో బెర్లిన్‌ మారథాన్‌లోనే కెన్యాకు చెందిన డెన్నిస్‌ కిమెట్టో (2:02.57 సెకన్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిప్‌చోగె బద్దలు కొట్టాడు. ఈ రేసులో తొలి మూడు స్థానాలను కెన్యా అథ్లెట్లే దక్కించుకోవడం విశేషం. కిప్రుటో అమోస్‌ (2:06.23 సె), కిప్‌సాంగ్‌ విల్సన్‌ (02:06. 48 సె) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ఎలియుడ్‌ కిప్‌చోగె ఇప్పటి వరకు పోటీపడ్డ 11 మారథాన్లలో పదింటిలో విజేతగా నిలిచాడు. కిప్‌చోగె 2004, 2008 ఒలింపిక్స్‌లో 5000 మీటర్ల పరుగులో కాంస్య, రజత పతకాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, September 17, 2018, 11:50 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X