
హైదరాబాద్: న్యూఢిల్లీ వేదికగా అరవై ఒకటవ జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. డిసెంబరు 14తో ముగిసిన ఈ పోటీల్లో విజేతగా గుజరాత్‌కు చెందిన ఎలవెనిల్ స్వర్ణాన్ని గెలుచుకుంది. వెండి పతకం రాజరస్థాన్‌కు, కాంస్యం బెంగాల్‌కు దక్కాయి.
2014 కామన్ వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణాన్ని గెలిచిన ఎలవెనిల్ ప్రస్తుత ఛాంపియన్ ఫిప్ లోనూ 250.6 స్కోరుతో మళ్లీ స్వర్ణాన్ని గెలిచింది. కొద్దిపాటి వ్యత్యాసంతో రాజస్థాన్‌కు చెందిన అపూర్వి చండేలా వెండి పతకాన్ని గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మెహూలీ గోష్ 228.7 గా స్కోరు పొంది కాంస్యాన్ని గెలుచుకుంది.
మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో మొత్తం ఎనిమిది మంది ఫైనల్‌లో తలపడ్డారు. ఈ ముగ్గురే పతకాలను గెలుచుకోగా మిగిలిన ఏడుగురు వెనుదిరగాల్సి వచ్చింది. ఆ ఏడుగురిల రియో ఒలింపిక్స్ లో పాల్గొన్న అయోనికా పాల్, ప్రస్తుత అంతర్జాతీయ పూజా ఘట్కర్, అంజుమ్ మౌడ్గిల్ ఉండటం విశేషం.
ఎలవెనిల్ మహిళల సింగిల్స్‌లోనే కాకుండా జట్టుతో కలిసి కూడా స్వర్ణాన్ని నమోదు చేసింది. గుజరాత్ కు చెందిన లజ్జాస్వామి అండ్ హేమా జట్టుతో కలిసి ఈ ఘనతను సాధించింది. గుజరాత్ జట్టు స్కోరు 1244.8 గా ఉండగా, మహారాష్ట్ర జట్టు 0.8 తేడాతో స్వర్ణాన్ని దక్కించుకుంది. వీరందరి కంటే పశ్చిమ బెంగాల్ జట్టుకు 1.8 తక్కువ స్కోరు రావడంతో కాంస్యంతో సరిపెట్టుకుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.