Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Dwayne Johnson: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ 'ది రాక్'కు కరోనా!!

Dwayne Johnson says he and his family had tested positive for Covid-19

లాస్ ఏంజెల్స్: హాలీవుడ్ అగ్ర హీరో, డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ డ్వెయిన్ జాన్స‌న్‌కు క‌రోనా సోకింది. ఆయన భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా వైరస్ సోకిందని ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. దీంతో అతని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈలో డ్వేన్ జాన్సన్ ను 'ది రాక్'గా పిలుస్తుంటారు. మాజీ రెజ్ల‌ర్ అయిన జాన్స‌న్ ప్ర‌స్తుతం ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక పారితోషం అందుకుంటున్న హీరోగా మారాడు.

భార్య లారెన్, ఇద్దరు కుమార్తెలు టియానా మరియు జాస్మిన్ కరోనా వైరస్ బారిన పడ్డారు అని డ్వెయిన్ జాన్స‌న్‌ పోస్ట్ చేసాడు. 'నా భార్య, ఇద్దరు కుమార్తెలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కుటుంబంగా మేము భరించాల్సిన చాలా కష్టమైన మరియు సవాలుతో కూడుకున్న విషయాలలో ఇది ఒకటి. చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉన్నా మాకు వైర‌స్ సంక్ర‌మించింది. రెండున్న వారాల క్రితం మాకు వైర‌స్ సోకింది. ఇప్పుడు అందరం బాగున్నాం' అని 48 ఏళ్ల జాన్స‌న్ చెప్పాడు.

ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి త‌మ‌కు వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు 'ది రాక్ చెప్పాడు. ఇది చాలా విప‌త్క‌ర‌మైన స‌మ‌యం అని, స‌వాళ్ల‌తో కూడుకున్న‌ద‌న్నాడు. త‌న ప్రాధాన క‌ర్త‌వ్యం త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డ‌మే అని తెలిపాడు. కోవిడ్‌19కు పాజిటివ్‌గా తేల‌డం అంటే.. ఎన్నో గాయాల క‌న్నా ఇది భిన్న‌మైంద‌న్నాడు. మాస్క్‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని, దీన్ని రాజ‌కీయ ఎజెండా కూడా మార్చాల‌ని డ్వెయిన్ జాన్స‌న్ ‌సూచించాడు.

సినిమాల్లో ప్ర‌వేశించ‌డానికి ముందు 1990లలో వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ పోటీల్లో డ్వెయిన్ జాన్స‌న్ చాలా పాపుల‌ర్ అయ్యాడు. 'ది రాక్'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ద స్కార్పియ‌న్ కింగ్‌, ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌, జుమాంజీ లాంటి చిత్రాల్లో న‌టించాడు. ఆ సినిమాలతో జాన్స‌న్ ప్ర‌స్తుతం ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక పారితోషం అందుకుంటున్న హీరోగా మారాడు.

Story first published: Thursday, September 3, 2020, 12:05 [IST]
Other articles published on Sep 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+