డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన ఒలింపిక్స్ అథ్లెట్‌కు ఎనిమిదిన్నర ఏళ్లు జైలు శిక్ష

హైదరాబాద్: డచ్ ఒలింపిక్ అథ్లెట్ మాడియా గఫూర్‌కు అక్కడి ప్రభుత్వం ఎనిమిదిన్నర ఏళ్లు జైలు శిక్ష విధించింది. జర్మనీలో తన కారులో 2 మిలియన్ పౌండ్ల విలువైన డ్రగ్స్ లభించడంతో పాటు క్రిస్టల్ మెథ్ దొరికినందుకు ఆమెకు ఈ శిక్ష విధించినట్లు జర్మనీ డీపీఎ వార్తా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ ఏడాది జూన్‌లో 27 ఏళ్ల మాడియా గఫూర్ ప్రయాణిస్తోన్న కారుని ఎల్టెన్‌లోని సరిహద్దులో తనిఖీ చేయగా 50 కిలోల ఎస్కాటే, 2 కేజీల క్రిస్టల్ మెథ్‌తో పాటు 11,950 యూరోల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని ఆమెను క్లేవ్ డిస్ట్రిక్ట్ కోర్టులో జర్మన్ పోలీసులు హాజరుపరిచారు.
ఆమెపై ఆరోపించిన నేరాలను అంగీరించడంతో పాటు డోపింగ్‌కు పాల్పడే సామాగ్రిని తీసుకెళ్తున్నట్లు ఒప్పుకుంది. 2016లో రియో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో మాడియా గఫూర్ నెదర్లాండ్స్ తరుపున 400 మీటర్ల రిలేలో పాల్గొంది. మాడియా గఫూర్‌కు ఎనిమిదిన్నర ఏళ్లు జైలు శిక్ష పడటంతో డచ్ అథ్లెటిక్స్ యూనియన్ దిగ్భ్రాంతికి గురైంది.
ఈ కేసులో మాడియా గఫూర్‌తో పాటు మరెవరి ప్రమేయం ఉందో తెలుసుకునేందుకు విచారణ కమిటీని నియమిస్తామని డచ్ అథ్లెటిక్స్ యూనియన్ వెల్లడించింది. డచ్ అథ్లెటిక్స్ యూనియన్ వెబ్‌సైట్‌లో ఈ తీర్పు మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని రాసుకొచ్చింది. జర్మన్ కోర్టు తీర్పు తర్వాత గపూర్‌పై చర్యలకు డచ్ అథ్లెటిక్స్ యూనియన్ తిరస్కరించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications