Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైయస్ తో తెలుగుతేజం హారిక భేటీ

Dronavalli Harika
హైదరాబాద్: ప్రపంచ బాలికల చెస్ ఛాంపియన్ షిప్ విజేత ద్రోణవల్లి హారిక మంగళవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసింది. చాంపియన్ షిప్ గెలుచుకున్న సందర్భంగా తాము ముఖ్యమంత్రిని కలిశామని హారిక తండ్రి రామకృష్ణ చెప్పారు. వారితో పాటు మంత్రి మాగంటి వెంకటేశ్వరరావు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ద్రోణవల్లి హారికను ముఖ్యమంత్రి అభినందించారు.

ద్రోణవల్లి హారక రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి వెంకటేశ్వరరావు అన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ అథారిటీని బలోపేతం చేయాలని తాము ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.
Story first published: Tuesday, August 19, 2008, 16:43 [IST]
Other articles published on Aug 19, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+