Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డోప్ స్కాండల్: విదేశీ కోచ్‌లకు ఉద్వాసన పలికిన భారత్

Dope Scandal
న్యూఢిల్లీ: భారత అథ్లెట్లు వరుసగా డోపింగ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలుతూ పరువు తీస్తున్న విషయం తెలిసిందే. దీంతో దేశం యొక్క స్పోర్ట్స్ ఇమేజి దెబ్బతినడంతో స్పోర్ట్స్ మినిస్టర్ అజయ్ ఈరోజు ఎవరైతే విదేశీ కోచ్‌లు భారత అధ్లెట్లుకి ట్రైనింగ్ ఇస్తున్నారో వారందరిని తీసి వేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా స్పోర్ట్స్ అధారిటీ ఆప్ ఇండియా(SAI) స్పష్టం చేసింది. డోపింగ్‌ ఎఫెక్టుతో మొట్టమొదట స్పోర్ట్స్ మినిస్టర్ తీసివేసినటువంటి కోచ్ ఉక్రేనియన్ కోచ్ యురి ఓజ్రోజ్నిక్. ఇక యురి ఓజ్రోజ్నిక్ ఇండియన్ టీమ్‌ అధ్లెట్లు కోచ్‌గా కామన్ వెల్త్ గేమ్స్‌కు ముందుగానే రావడం జరిగింది.

అంతేకాకుండా స్పోర్ట్స్ మినిస్టర్ ఈ డోపింగ్ విషయంపై పార్లమెంట్ ద్వారా ఓ ఎంక్వయిరీ ప్యానెల్‌ని నియమించి దానికి ఓ మాజీ హైకోర్టు న్యాయమూర్తిని పెద్దగా నియమించడం జరుగుతుందని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా డోపింగ్‌కి సంబంధించిన పూర్తి సమాచారం అందించవలసిందిగా స్పోర్ట్స్ అధారిటీ ఇండియా పాటియాలా, అద్లెట్లు ఫెడరేషన్‌ని కోరడం జరిగింది. అసలు అద్లెట్లుకు డ్రగ్స్ ఎక్కడి నుండి అందాయో అన్న అంశం మీద నాడా, నేషనల్ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌ని విచారణ చేస్తుంది. సాధారణంగా అద్లెట్లుకి భోజనం సదుపాయం కల్పించే భాద్యతను నేషనల్ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌ పర్యవేక్షణలో ఉంది గనుక.

డోపింగ్ టెస్టులో ఇలా ఇండియన్ అద్లెట్లు దొరికిపోవడంతో నేషనల్ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌, పాటియాలాలో అద్లెట్లుకి ట్రైనింగ్ ఇచ్చే క్యాంప్స్ వద్ద డాక్టర్స్, అఫీసియల్స్‌ని ఎక్కువ మందిని ఉంచినట్లు సమాచారం. డోపింగ్ టెస్టు ప్రస్తుతం వార్తల్లోకి రావడంతో మాజీ అద్లెట్లు అయిన మేకా సింగ్, అశ్విని నాచెప్ప, కోచ్‌లు ప్లేయర్లను నిందిస్తున్నారు. ఇటీవలే ఆరుగురు అథ్లెట్లు ఇదే విధంగా పట్టుబడగా తాజాగా కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన అశ్విని అక్కుంజి, స్ప్రింటర్ ప్రియాంక పన్వర్ డోప్ టెస్టులో విఫలమయ్యారు. ఎన్‌ఐఎస్ పాటియాలాలో 'నాడా" నిర్వహించిన పరీక్షలో వీరిద్దరూ అనబోలిక్ స్టెరాయిడ్స్ వాడినట్టు తేలింది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అశ్విని, ప్రియాంక కొద్ది గంటల్లో జపాన్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఫలితం వెలువడింది. నిబంధనల ప్రకారం భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ సందర్బంలో మాజీ ప్రపంచ చాంపియన్ మైక్ పావెల్ మాట్లాడుతూ ఓవరాల్‌గా చూస్తే డోపీలు పట్టుబడడం క్రీడలకు మేలు చేకూరుస్తుంది. డోపింగ్‌పై మనమెంత సీరియస్‌గా ఉన్నామో ఇలాంటి సంఘటనలు తెలుపుతాయి. అథ్లెటిక్స్‌లో సహజంగానే ఎక్కువగా డోపింగ్‌లో దొరుకుతుంటారు. మళ్లీ ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం అథ్లెట్లు చాలా రిస్క్ తీసుకుంటున్నట్టే భావించాలి అని ఐఏఏఎఫ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న పావెల్ తెలిపాడు. మరోవైపు లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జి ప్రయత్నాలు ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. 'అంజూ చాలా నైపుణ్యం గల అథ్లెట్. ఒకవేళ తను పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉంటే కచ్చితంగా మెడల్ దక్కే అవకాశం ఉంది. తల్లిగా మారిన తర్వాత ఎవరికైనా ఇంకాస్త శరీర పటుత్వం, అంకితభావం కావాల్సిందే" అని పావెల్ సూచించాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+