For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రంప్ మంచి ఆటగాడే.. 79 ఏళ్ల వయస్సులోనూ ఆమెతో..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చిన్న చిన్న కామెంట్స్ కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ వ్యక్తి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. ఈ సారి బ్రిటన్‌కు చెందిన ప్రముఖ గోల్ఫర్ చార్లీ హల్‌తో సంబంధం ఉన్న ఓ విషయం వెలుగులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటనకు వెళ్లినప్పుడు చార్లీ విండ్సర్ క్యాజిల్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి విందులో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఆమెకు ఓ ప్రత్యేక అభ్యర్థన చేశారు. దానిని చార్లీ అంగీకరించారు.

ప్రపంచంలోని టాప్ 10 గోల్ఫర్లలో ఒకరైన చార్లీ హల్.. డొనాల్డ్ ట్రంప్, కీర్ స్టార్మర్, కింగ్ చార్లెస్ IIIతో పాటు మొత్తం 160 మంది అతిథులలో ఒకరు. డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన విందు గురించి ఆమె మాట్లాడుతూ.. తాను ట్రంప్‌తో మాట్లాడినప్పుడు ఆయన మనసులో గోల్ఫ్ తప్ప మరేమీ లేదని వెల్లడించారు. ఈ సమయంలోనే ట్రంప్ ఆమెను తనతో గోల్ఫ్ ఆడటానికి ఆహ్వానించారు. దీనికి ఆమె అంగీకరించారు.

Donald Trump Invites Golfer Charley Hull for a Golf Match at 79

ఈ ఏడాది చివరిలో మ్యాచ్ జరిగే అవకాశం
చార్లీ హల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను నిన్న రాత్రి ఆయనతో మాట్లాడాను. ఆయన నన్ను ఆహ్వానించారు. ఒక మ్యాచ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అది చాలా బాగుంటుంది. మేము నిన్న రాత్రి దీని గురించి మాట్లాడుకున్నాం. ఈ ఏడాది చివరలో తప్పకుండా ఓ మ్యాచ్ జరుగుతుంది" అని అన్నారు."ఆయన చాలా మంచి వ్యక్తి, నేను ఆయనతో చాలా బాగా ఉన్నాను. ఆయనతో గోల్ఫ్ ఆడటానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఆయన అందరితోనూ చాలా బాగా ప్రవర్తించారు" అని కూడా చెప్పారు.

చార్లీ హల్ ఇంకా మాట్లాడుతూ, "మేము కేవలం గోల్ఫ్ గురించే మాట్లాడుకున్నాం, ఆయనకు ఎల్‌పీజీఏ టూర్‌లోని కొందరు ఆటగాళ్లు, కొంతమంది గోల్ఫర్ల గురించి తెలుసు. అధ్యక్షుడు ట్రంప్‌కు గోల్ఫ్ గురించి మంచి అవగాహన ఉంది" అని వెల్లడించారు. ఈ వారం చివరిలో క్రోగర్ క్వీన్ సిటీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న చార్లీ హల్, ట్రంప్‌కు పెద్ద మద్దతుదారుగా ఉన్నారు. ఆమె మైదానంలో ఆయన ప్రచార నృత్యాలను కూడా అనుకరించడం గమనార్హం.

Story first published: Wednesday, September 24, 2025, 11:17 [IST]
Other articles published on Sep 24, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+