కీలక సభ్యుడైనా ఆశ్చర్యంలేదు: గుర్‌కీరత్‌పై కోహ్లీ ప్రశంసలు
బెంగళూరు: ఇటీవల రంజీ ట్రోఫీ మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్న పంజాబ్ ఆల్ రౌండర్ గుర్‌కీరత్ సింగ్‌పై టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. అతనొక ప్రమాదకర ఆటగాడని, ప్రత్యర్థి చేతుల్లోంచి మ్యాచును లాగేసుకుంటాడంటూ కీరత్‌నువిరాట్ కొనియాడాడు.
శనివారం నుంచి బెంగళూరులో ఆరంభం కానున్న రెండో టెస్టులో గుర్ కీరత్ తుది జట్టులో ఉండవచ్చనే సంకేతాల నేపథ్యంలో విరాట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలో టీమిండియా జట్టులో గుర్ కీరత్ కీలక సభ్యుడైనా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఈ సందర్భంగా గుర్ కీరత్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.

కీరత్ ఎప్పుడు ఆడతాడనేది కచ్చితంగా చెప్పలేనన్నాడు. టీమిండియా ప్రధాన సమస్యగా మారిన ఆరు, ఏడు స్థానాల్లో ఆడటానికి గుర్ కీరత్ బ్యాటింగ్ శైలి అతికినట్లు సరిపోతుందంటూ విరాట్ అభిప్రాయపడ్డాడు.
'గుర్ కీరత్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. సహజసిద్ధంగా ఆడతాడు. ప్రత్యర్థి జట్ల గెలుపును కూడా అనేక సందర్భాల్లో అడ్డుకున్నాడు. ఈ సీజన్ లో ఇండియా -ఏ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. గుర్ కీరత్ ప్రధానంగా బ్యాట్స్‌మన్. బౌలింగ్ కూడా ఆకట్టుకుంటాడు. బౌలింగ్‌లో ఎక్కువగా కష్టపడతాడు. రాబోవు ఏడాదిన్నర కాలంలో టీమిండియా చాలా టెస్టు మ్యాచులు ఆడనుంది. ఈ తరహా క్రికెటర్ల అవసరం జట్టుకు చాలా ఉంది' అని కోహ్లి పేర్కొన్నాడు.
ఉమేశ్ యాదవ్, వరుణ్ అరోన్‌లు కూడా మ్యాచుల్లో రాణిస్తున్నారని చెప్పాడు. రెండో టెస్టులో గెలుపొందేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పాడు కోహ్లీ. సమష్టి ప్రణాళికలను అమలు చేసి దక్షిణాఫ్రికాను కట్టడి చేస్తామని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications