
28వ పడిలోకి దీపికా పల్లికల్
దీపికా పల్లికల్ సెప్టెంబర్ 21, 1991న చెన్నైలో జన్మించింది. ఆమె తల్లి తండ్రులు సుసాన్, సంజీవ్. దీపికాకు ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఆమెకు స్క్వాష్ అభిమానం. దీంతో 10 ఏళ్ల వయసులోనే రాకెట్ పట్టుకుంది. ఆరో తరగతిలోనే పలు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంది.

టాప్-10 స్క్వాష్ మహిళా ప్లేయర్ల జాబితాలో
చెన్నైలోని ఎథిరాజ్ ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లిష్ ఆనర్స్‌లో బీఏ పట్టా సాధించింది. ప్రపంచ టాప్-10 స్క్వాష్ మహిళా ప్లేయర్ల జాబితాలో స్థానం దక్కించుకున్న తొలి భారత క్రీడాకారిణి దీపికా పల్లికల్ నిలిచింది. 2008లో టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ను ‘చెన్నై మారథాన్'లో కలుసుకుంది.

2015లో దినేశ్ కార్తీక్‌ను పెళ్లాడిన పల్లికల్
ఆ తర్వాత 2013లో వీరి పరిచయం స్నేహంగా మారింది. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత ఇద్దరూ 2015లో కుటుంబ సభ్యుల అనుమతితో వివాహాం చేసుకున్నారు. వీరి పెళ్లి క్రిస్టియన్, హిందూ పద్ధతుల్లో అంగరంగ వైభవంగా సాగింది. 2012లో అర్జున అవార్డు, 2014లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.

తొలి స్క్వాష్ ప్లేయర్‌గా
ఈ క్రమంలో అర్జున అవార్డు అందుకున్న తొలి స్క్వాష్ ప్లేయర్‌గా దీపికా పల్లికల్ చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు ఆసియా గేమ్స్‌లో సైతం దీపికా పల్లికల్ అనేక పతకాలను సాధించింది. కామన్వెల్త్ గేమ్స్ 2018లో స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని కోల్పోయిన నేపథ్యంలో పల్లికల్ అంఫైర్ నిర్ణయంపై ప్రశ్నించింది.

స్క్వాష్‌లో దీపికా పల్లికల్ సాధించిన విజయాలను ఒక్కసారి పరిశీలిస్తే:
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2014లో మహిళల డబుల్స్‌లో స్వర్ణం
గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2018లో మహిళల డబుల్స్‌లో రజత పతకం
మిక్స్‌డ్ డబుల్స్‌లో కామన్వెల్త్ గేమ్స్ 2018లో రజత పతకం
ఆసియా గేమ్స్ 2014లో భారత మహిళా జట్టులో రజత పతకం.
ఆసియా గేమ్స్ 2014లో మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం
జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్ 2018లో మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం


Click it and Unblock the Notifications












