జిమ్నాస్టిక్స్ వరల్డ్‌కప్: పసిడితో చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్

హైదరాబాద్: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అద్భుతం చేసింది. టర్కీలోని మెర్సిన్‌లో జరుగుతున్న ఎఫ్‌ఐజీ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ ఛాలెంజ్ కప్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకంతో సత్తా చాటింది. ఫైనల్లో దీపా కర్మాకర్ 14.150 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్‌లో 13.400 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు ఇండోనేసియా జిమ్నాస్ట్ రిఫ్దా ఇర్ఫానలుతిఫ్ 13.400 స్కోరు చేసి రజత పతకం అందుకోగా.. టర్కీ అమ్మాయి గోక్సు ఉక్టాస్ సనిల్ 13.400 స్కోరుతో కాంస్య పతకం దక్కించుకుంది.

స్వర్ణ పతకం నెగ్గిన తొలి జిమ్నాస్ట్‌గా
ఈ ప్రదర్శనతో దీపా కర్మాకర్ వరల్డ్‌కప్ జిమ్మాస్టిక్స్ చరిత్రలో పతకం నెగ్గిన రెండో భారతీయ జిమ్నాస్ట్‌గా, స్వర్ణ పతకం నెగ్గిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. అరుణా రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో మెల్ బోర్న్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో కాంస్య పతకంతో మెరిసిన సంగతి తెలిసిందే.

మోకాలి గాయం కారణంగా రెండేళ్లు ఆటకు దూరం
2016 రియో ఒలింపిక్స్‌లో ప్రొడునోవా విన్యాసంతో జిమ్నాస్టిక్స్ ప్రపంచాన్ని అబ్బురపరిచి పతకానికి చేరువగా వచ్చిన దీప.. ఆ తర్వాత మోకాలి గాయం కారణంగా దాదాపు రెండేళ్లు ఆటకు దూరమైంది. అయితే, గాయం నుంచి కోలుకుని తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది.

కామన్వెల్త్ క్రీడలకు దూరమైన దీపా కర్మార్కర్
ఈ క్రమంలోనే ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకొన్న దీపా కర్మార్కర్.. కాలి గాయానికి శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా కోలుకొని జిమ్నాస్టిక్స్ వరల్డ్ ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ పాల్గొంది. ఈ టోర్నీ వాల్ట్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ప్రధాని మోడీ అభినందన
ఈ పతకంతో దీపా కర్మాకర్ దేశానికే గర్వకారణంగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు తెలిపారు. మరోవైపు పురుషుల రంగ్స్ విభాగంలో రాకేష్ పాత్రా నాలుగోస్థానంలో నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications