Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్‌.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!

Dipa karmakar talks after she was handed 21 months ban after failing doping test

భారత దేశానికి చెందిన ప్రముఖ జిమ్నాస్ట్ దీప కర్మాకర్‌పై నిషేధం విధిస్తున్నట్లు భారత జిమ్నాస్ట్ ఫెడరేషన్ ప్రకటించింది. ఆమెను 21 నెలలపాటు ఆటకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆమె నిషేధిత డ్రగ్స్ తీసుకున్న కారణంగానే దీపపై ఈ బ్యాన్ అమలు చేస్తున్నట్లు జిమ్నాస్ట్ సంఘం వెల్లడించింది. ఆమె రక్తంలో వరల్డ్ జిమ్నాస్ట్ సంఘం నిషేధించిన హైజమిన్ అనే డ్రగ్ ఉన్నట్లు సమాచారం. ఇలా తనపై బ్యాన్ విధించడంపై దీప తాజాగా స్పందించింది. తను ఆ డ్రగ్ ఎలా తీసుకున్నానో కూడా తకు గుర్తులేదని, పొరపాటు ఈ డ్రగ్ తనలో చేరిందని తెలిపింది.

'నా జీవితంలో నేను పోరాడిన అత్యంత సుదీర్ఘమైన పోరాటానికి ఈ రోజు తెరపడింది. అక్టోబరు 2021లో డ్రగ్ పరీక్షల కోసం నా శాంపిల్స్ తీసుకెళ్లాడు. ఈ పరీక్షల్లో నేను నిషేధిత డ్రగ్ వాడినట్లు ఫలితాలు వచ్చాయి. ఇది ఎలా జరిగిందో కూడా నేను చెప్పలేకపోయాను. పొరపాటున ఈ డ్రగ్ నాలో చేరి ఉంటుంది' అని దీప వివరించింది.

దీంతో తాను నిషేధం అందుకోవడానికి సిద్ధమయ్యానని తెలిపింది. అయితే ఆమె తన పొరపాటు ఒప్పుకొని, అసలు అది ఎలా జరిగిందో కూడా చెప్పలేకపోవడంతో ఆమెపై నిషేధాన్ని మూడు నెలకు జిమ్నాస్ట్ సంఘం తగ్గించింది. అంతర్జాతీయ జిమ్నాస్ట్ సంఘంతో చర్చల అనంతరం చాలా వేగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీప తెలిపింది.

Dipa karmakar talks after she was handed 21 months ban after failing doping test

సాధారణంగా ఇలా డోపింగ్ చేస్తూ జరిపితే 25 నెలలపాటు నిషేధం విధిస్తారు. కానీ పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు దీపకు కేవలం 21 నెలల నిషేధం మాత్రమే విధిస్తారు. అయితే దీప తనకు తెలియకుండా ఈ డ్రగ్ తీసుకున్నట్లు నమ్మిన జిమ్నాస్ట్ సంఘం ఈ నిషేధాన్ని మూడు నెలలు తగ్గించి 21 నెలలకు కుదించింది.

శాంపిల్ సేకరించినప్పటి నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది జూలై 10న ఆమెపై విధించిన బ్యాన్ ముగుస్తుంది. ఇదే విషయాన్ని తెలిపిన దీప.. ఈ తేదీన మళ్లీ తనకు ఎంతో ఇష్టమైన క్రీడ ఆడతానని తెలిపింది.

Story first published: Sunday, February 5, 2023, 16:35 [IST]
Other articles published on Feb 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+