హైదరాబాద్: అజర్బైజాన్ వేదికగా జరుగుతున్న అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు నిరాశ ఎదురైంది. శుక్రవారం జరిగిన బ్యాలెన్స్డ్ బీమ్ విభాగంలో దీప ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. శుక్రవారం అర్హత రౌండ్లో ఆమె కేవలం 10.633 పాయింట్లు సాధించి 20వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది.
No. 4లో పుజారా: నా మాటలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించొచ్చన్న గంగూలీ
మొత్తం 25 మంది జిమ్నాస్ట్‌లు పోటీపడ్డా బీమ్ కేటగిరీలో సహచరులకు దీటైన పోటీనివ్వలేక పెనాల్టీ పాయింట్లతో ఫైనల్ పోరులో నిలువలేకపోయింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా నెవ్దోవ్ 13.466 పాయింట్లతో అందరికంటే ఎక్కువ స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టాప్-8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది.
అయితే, దీపా కర్మాకర్ ఇప్పటికే వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత పొందిన సంగతి తెలిసిందే. శనివారం జరిగే వాల్ట్ ఫైనల్లో దీప బరిలోకి దిగనుంది.