Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆయన వల్లే ఇలా: పద్మశ్రీని కోచ్‌కి అంకితం చేసిన దీపా

హైదరాబాద్: గతేడాది జరిగిన రియో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభను కనబర్చి నాలుగో అత్యున్నత పురస్కారానికి ఎంపికైన జిమ్నాస్టిక్‌ దీపా కర్మాకర్‌ తనకు లభించిన పురస్కారాన్ని తన గురువు బిశ్వేశ్వర్ నందికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించింది.

2017 సంవత్సరానికి గాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా ఎనిమిది పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ ఎనిమిది మందిలో జిమ్నాస్టిక్‌ దీపా కర్మాకర్‌ ఒకరు. తనకు ఈ పురస్కారం లభించడంపై 'దేశంలోనే అత్యుత్తమ పురస్కరాల్లో ఒకటైన పద్మశ్రీకి ఎంపిక అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా పెద్ద గౌరవం. ఈ అవార్డుకు సిఫారసు చేసిన స్పోర్ట్ అథారిటీకి ధన్యవాదాలు. ఇది నాకు ప్రారంభం మాత్రమే. నేను ప్రయాణించవలసిన మార్గం ఇంకా ఎంతో ఉంది' అని చెప్పింది.

రియో ఒలింపిక్స్‌లో అత్యంత ప్రమాదకరమైన ప్రొడునోవా వాల్ట్ విన్యాసంలో కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చుకుంది. దీంతో దీపా కర్మార్కర్ విన్యాసాలకు యావత్ జాతి మొత్తం గర్వపడింది. అంతేకాదు ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించింది.

ఆయన వల్లే ఇలా

ఆయన వల్లే ఇలా

ఈరోజు తాను సాధించిన దాని అంతటికి కారణం తన కోచ్‌యేనని అందుకు కోచ్ నందికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. గతేడాది నంది కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు. తన శిష్యురాలైన దీపా కర్మార్కర్‌కు పద్మశ్రీ అవార్డు లభించడం పట్ల నంది సంతోషం వ్యక్తం చేశారు.

16 సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతుంది

16 సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతుంది

దీపా కర్మార్కర్ తన దగ్గర 16 సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతున్నట్లు ఆయన తెలిపారు. 'పద్మశ్రీకి దీపా అర్హురాలు. ఆమె ఒక అద్భుతమైన స్పోర్ట్స్‌పర్సన్. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించకపోయినా ఆమె ప్రదర్శన పట్ల తాను ఎంతో గర్వంగా ఉన్నా. కచ్చితంగా 2020లో జరిగే ఒలింపిక్స్‌లో దీపా పతకాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపారు.

ప్రతి అథ్లెట్ కూడా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే

ప్రతి అథ్లెట్ కూడా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే

ప్రతి అథ్లెట్ కూడా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే లక్ష్యంతోనే వెళతారని చెప్పాడు. తన అకాడమీ ద్వారా దీపా కర్మార్కర్ లాంటి క్రీడాకారులను దేశానికి ఎంతో మందిని అందించాలన్నదే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఓ చిన్న అకాడమీని నడుపుతున్నానని అన్నాడు.

రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మార్కర్ అద్భుత ప్రదర్శన

రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మార్కర్ అద్భుత ప్రదర్శన

రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మార్కర్ అద్భుత ప్రదర్శనను చూసిన తర్వాత తన వద్ద కోచింగ్ నేర్చుకుంటామని శిష్యులు వస్తున్నట్లు తెలిపాడు. తన వద్దకు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీపాలాగా మమ్మల్ని కూడా తయారు చేయాలని అడుగుతున్నారని అన్నాడు. త్రిపుర రాజధాని అగర్తలలో ఉన్న నేతాజీ సుబాష్ రీజినల్ కోచింగ్ సెంటర్‌లో దీపా శిక్షణ పొందుతుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+