చెన్నై: క్రికెటర్ దినేశ్ కార్తీక్, అతని ప్రియురాలు, స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్‌ల వివాహం 2015లో జరుగనుంది. ఇద్దరికీ నిరుడు నిశ్చితార్థం అయినప్పటికీ వారివారి కెరీర్‌లో బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ఏడాది పెళ్లి చేసుకునే అవకాశం లేకపోయింది. దీంతో తమ వివాహం వచ్చే ఏడాదే అని దీపిక స్పష్టం చేసింది.
అంతేగాక తమ ఇద్దరి మతాలు వేరు కావడం వల్ల ఆయా మతాచారాల ప్రకారం రెండు సార్లు వివాహ క్రతువు ఉంటుందని దీపికా పళ్లికల్ తెలిపింది. తనకు ఈ ఏడాది ఆసియా గేమ్స్ తోపాటు మరికొన్ని టోర్నమెంట్లున్నాయని చెప్పింది.

'అదే విధంగా దినేశ్ కార్తీక్‌కు కూడా పలు దేశావాళీ టోర్నీలున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ నుంచి వచ్చాక ఇప్పటి వరకు కూడా మా రెండు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకునేందుకు తీరిక దొరకలేదు' అని దీపిక తెలిపింది.
అందుకే తమ వివాహం ఇక 2015లోనే జరుగుతుందని దీపిక వెల్లడించింది. 'నేను క్రిస్టియన్, తను హిందూ. అందుకే మా సంప్రదాయాలకు అనుగుణంగా వివాహ వేడుక రెండు సార్లు జరుపుతాం' అని దీపిక పేర్కొంది.