For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇరికించాడు: కంటతడి పెట్టిన మారడోనా మాజీ ప్రేయసి

బ్యూనస్‌ఎయిర్స్: తనను అన్యాయంగా దొంగతనం కేసులో ఇరికించాడని అర్జెంటీనా మాజీ ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా మాజీ ప్రేయసి రోకియో ఒలివియా పేర్కొంది. తన బంగారు ఆభరణాలను మాజీ ప్రేయసి రోకియో ఓలివియా దొంగతనం చేసిందని డిగో మారడోనా ఆరోపణలు చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కాగా, రోకియో ఒలివియా శుక్రవారం బెయిల్‌పై జైలు నుంచి విడుదలైంది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను డిగో మారడోనాకు సంబంధించిన బంగారు ఆభరణాలను దోచుకెళ్లలేదని స్పష్టం చేసింది. తనను కావాలనే మారడోనా ఇరికించాడని చెప్పింది. తాను అతని వద్ద ఎలాంటి వస్తువులను దొంగలించలేదని తెలిపింది.

'Diego Maradona Set Me Up,' Says Arrested Ex-Girlfriend

తనను కావాలనే మారోడోనా ఇరికిస్తున్నాడని రోకియో కన్నీటి పర్యాంతమైంది. ఆ దొంగతనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. శుక్రవారం రోకియోను విచారించిన బ్యూనస్ ఎయిర్స్ కోర్టు ఆమెకు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

తన ఇంట్లోని బంగారు ఆభరణాలతోపాటు విలువైన వస్తువులను రోకియో దోచుకెళ్లిందని మారడోనా ఆరోపించడంతో ఆమెకు దుబాయ్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో గత బుధవారం బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎజిజ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రోకియో ఒలివియాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+