దొంగ: మాజీ ప్రేయసి రోసియా ఓలీవియాపై మారడోనా
హైదరాబాద్: తన మాజీ ప్రేయసి రోసియా ఒలివీయా (22) ఓ దొంగ అని అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనా (53) అంటున్నాడు. మారడోనా ఆట నుంచి రిటైరైనా ఫేమ్‌కు కొదవలేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మీడియాకెక్కడం మారడోనా శైలి. తాజాగా, తన మాజీ ప్రేయసి రోసియా ఒలీవియా (22) ఓ దొంగ అని ఆరోపిస్తున్నాడు.
అంతేగాకుండా, ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒలీవియా తన డైమండ్ ఇయర్ రింగ్స్, వాచీలతో ఉడాయించిందని మారడోనా అంటున్నాడు. కాగా, ఆమెపై అంతర్జాతీయంగా అరెస్టు వారంట్ కోరుతున్నామని మారడోనా తరఫు అటార్నీ మథియాస్ మోర్లా చెప్పారు.

బ్రెజిల్‌లో మారడోనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. మారడోనా ఆరోపణలను రోసియా ఓలీవియా తోసిపుచ్చుతోంది. రెండు వారాల క్రితం వారిద్దరు కలుసుకుని రాజీకి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే అది ఫలించలేదు.
మారడోనా, ఒలీవియా దుబాయ్‌లో కొన్నాళ్ళపాటు కలిసి జీవించారు. ఒలీవియా కూడా సాకర్ క్రీడాకారిణే. రెండు వారాల క్రితం వీరిద్దరూ రియో డి జెనీరోలో కనిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications