పానాజీ: దేశంలో ఫుట్‌బాల్ ఆటను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) జట్లు ఎఫ్‌సి గోవా, ముంబై సిటీ ఎఫ్‌సి, ఎఫ్‌సి పుణెలలో గోవా క్రీడాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో లెఫ్ట్‌వింగ్ మిడ్ ఫీల్డర్‌గా ప్రత్యర్థులకు కొరుకుడు పడని క్రీడాకారుడు మందార్‌రావు దేశాయ్ (24) ఒకరు. ఎఫ్‌సి గోవా, ఐ - లీగ్‌లో ప్రొఫెషనల్ ఆటగాడిగా అందరి మన్ననలు పొందారు.
శరవేగంగా బంతిని ఫుల్‌బ్యాక్ చేయగల సామర్థ్యం ఆయన సొంతం. 2013 - 14లో ఐ - లీగ్ ద్వారా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడలో అడుగు పెట్టాడు. ప్రారంభం నుంచే ఐఎస్‌ఎల్ టోర్నీలో ఆడుతున్న దేశాయి 'ఎఫ్‌సి గోవా' జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

తొలి ఏడాది టోర్నీ పూర్తయ్యే వరకు మ్యాచ్‌ల్లో ఆడిన దేశాయి.. లెఫ్ట్‌వింగ్‌లో ప్రతిభను కనబరుస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. తొలి సీజన్‌లో జికోను ఆకట్టుకున్న దేశాయ్ ఐఎస్‌ఎల్ రెండో సీజన్‌లోనూ ఎఫ్‌సి గోవాలో చోటు దక్కించుకోవడంతోపాటు ఢిల్లీ డైనమోపై 2 - 0 స్కోరు తేడాతో, తర్వాత కేరళ బ్లాస్టర్స్‌పై మూడో గోల్‌తో విజయంలో దేశాయ్‌ది కీలక పాత్ర.
2016 - 17 సీజన్‌కు గడువు ముగియడంతో తన సొంత డెంపో క్లబ్ తరుపున ఆడారు. అంతర్జాతీయంగా గోవా జట్టుకు కెప్టెన్‌గా మందార్.. 2014 లూసోఫోనీ గేమ్స్‌లో పాల్గొన్నారు.