Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడో టెస్టు: పోరాడుతున్న ఆసీస్

India
న్యూఢిల్లీ: భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో శుక్రవారం ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ నలుగురు అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆస్ట్రిలియా బ్యాట్స్ మెన్ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కునే ప్రయత్నం చేస్తున్నారు. మాధ్యూ హెడెన్ 83, కటిచ్ 64, పాంటింగ్ 87, హస్సీ 53 పరుగులు చేశారు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. మిశ్రాకు ఒక వికెట్, సెహ్వాగ్ కు మూడు వికెట్లు వచ్చాయి. వేలికి గాయం కావడంతో అనిల్ కుంబ్లే మైదానం వీడి పోయాడు. దీంతో మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఆట ముగిసే సమయానికి క్లార్క్ 21 పరుగులతో, వాట్సన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఢిల్లీలోని ఫెరోజ్ షా కొట్లా స్టేడియంలో జరుగుతున్న భారత్-ఆసీస్ మూడో టెస్టులో భాగంగా శుక్రవారం భారత్ బౌలర్లను ఆస్ట్రేలియా నిలకడగా ఎదుర్కొంటోంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 613 పరుగులు సాధించిసంగతి తెలిసిందే. భారత్ భారీ స్కోరుతో ఒత్తిడిలో ఉన్న ఆసీస్ భారత్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తోంది. శుక్రవారం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఓపెనర్లుగా బరిలోకి దిగిన మాథ్యూ హెడెన్, సైమన్ కటిచ్‌లు శుభారంభం చేశారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు వందకు పైచిలుకు పరుగుల భాగస్వామ్యాన్నినెలకొల్పారు. నిలకడగా ఆడుతూ జట్టుకు పరుగులు చేకూర్చేందుకు ప్రయత్నిస్తోన్న ఈ జంటను లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా విడదీశాడు. అర్థసెంచరీ సాధించిన సైమన్ కటిచ్‌ను మిశ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. 64 పరుగులు చేసి కటిచ్ అవుటయ్యాడు.
Story first published: Friday, October 31, 2008, 17:10 [IST]
Other articles published on Oct 31, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+