యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన కబడ్డీ స్కోరు గొడవ
హైదరాబాద్: కబడ్డీ మ్యాచ్‌లో చెలరేగిన చిన్న గొడవ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. దక్షిణ ఢిల్లీలోని దక్షిణ్‌పురి ప్రాంతంలో ఆదివారం రెండు కాలనీల మధ్య జరిగిన కబడ్డీ మ్యాచ్ 18 ఏళ్ల యువకుడిపై కాల్పుల వరకు తీసుకెళ్లింది. పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.
ఆదివారం రాత్రి రాత్రి ఓ పార్కులో సి బ్లాక్, 20 బ్లాక్ జట్ల మధ్య కబడ్డీ పోటీ జరిగింది. ఇరు జట్ల మధ్య స్కోరు విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన వారిలో ఇద్దరు వ్యక్తులు 20 బ్లాక్ జట్టుకు చెందిన క్రీడాకారుడు అవినాశ్‌పైకి కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో అవినాష్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని డీసీపీ రోమిల్ బానియా వెల్లడించారు. గాయాలు పాలైన అవినాశ్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని బాత్రా ఆస్పత్రికి తరలించారు. యువకుడి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో పుర్రె భాగంలో తేలికపాటి గాయమైందని, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగులను గుర్తించారు. వారిని అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు డీసీపీ రోమిల్ బానియా చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications