తృటిలో విమానం ప్రమాదం నుండి బయటపడ్డ ఢిల్లీ డేర్ డెవిల్స్
రాయపూర్: ఐపీఎల్ టీమ్ ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు చెందిన విమానం ప్రమాదం నుండి బయటపడింది. ఆటగాళ్లు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. జట్టు సభ్యులు అంతా ప్రయాణిస్తున్న ఇండిగో విమానం రాయపూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది.
ఆ సమయంలో రన్ వే పైన మరో విమానం నిలిచి ఉంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎదురుగా మరో విమానాన్ని గుర్తించిన పైలట్ మరింత వేగంగా బ్రేకులు వేశాడు. దాంతో పాటు విమానాన్ని పక్కకు మళ్లించాడు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగిందని సమాచారం.

రన్ వే పైన విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో మరో విమానం ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వవద్దు. ఈ ఘటన పైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
ముంబై నుండి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యే కంటే ముందే కోల్‌కతా - రాయపూర్ ఫ్లైట్ అప్పటికే అక్కడ రన్ వై పైన ఉందని చెబుతున్నారు. కాగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు మే 9, 12వ తేదీన రాయపూర్‌లోని షహీద్ వీర నారాయణ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్‌లు అడవలసి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications