Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Championships: నాలుగో భారత రెజ్లర్‌గా దీపక్‌ పూనియా

Deepak Punia 4th Indian wrestler to bag 2020 Olympics quota


హైదరాబాద్: కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజర్లు సత్తా చాటుతున్నారు. దీపక్ పూనియా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా... రాహుల్ అవేర్‌ సెమీ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్‌ కేటగిరీ క్వార్టర్‌ ఫైనల్లో భారత రెజ్లర్‌ దీపక్‌ పూనియా విజయం సాధించాడు.

దీపక్‌ పూనియా 7-6 తేడాతో కార్లోస్‌ ఈక్విర్డో(కొలంబియా)పై గెలిచి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. దీంతో 2020లో టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అంతేకాదు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నాలుగో భారత రెజ్లర్‌గా నిలిచాడు. ఇప్పటికే వినేశ్‌ ఫొగట్‌, భజరంగ్‌ పూనియా, రవి కుమార్‌లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

అంతేకాదు పైనపేర్కొన్న ముగ్గురు సెమీస్‌లో తమ ప్రత్యర్థులను ఓడించి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. అంతకముందు జూనియర్ వరల్డ్ ఛాంపియన్ అయిన దీపక్ పూనియా ఈ టోర్నీలో కోడిరౌవ్(టర్కీమెనిస్థాన్)పై 6-0తో విజయం సాధించి లాస్ట్-8కు దూసుకెళ్లాడు. దీపక్ పూనియా సెమీపైనల్లో స్టీఫెన్ రైచ్ ముత్(స్విట్జర్లాండ్‌)తో తలపడనున్నాడు.

మరోవైపు నాన్‌ ఒలింపిక్‌ 61 కేజీల విభాగంలో భారత రెజ్లర్‌ రాహుల్‌ అవేర్‌ సెమీస్‌కు చేరాడు. రాహుల్‌ అవేర్‌ 10-7 తేడాతో కజికిస్తాన్‌కు చెందిన కైలియెవ్‌పై గెలిచి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు.

Story first published: Saturday, September 21, 2019, 17:33 [IST]
Other articles published on Sep 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+