Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టేడియం ఫీజు చెల్లించని ఛార్జర్స్: రైడర్స్‌తో ఉప్పల్ మ్యాచ్ జరిగేనా?

Deccan Chargers
హైదరాబాద్: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మంగళవారం దక్కన్ ఛార్జర్స్‌కు జరగనున్న ఐపిఎల్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధ పరిస్థితి నెలకొంది. దక్కన్ ఛార్జర్స్ యాజమాన్యం హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు చెల్లించవలసిన గత నాలుగు మ్యాచ్‌ల బకాయిలు చెల్లించలేదని తెలుస్తోంది. ఐపిఎల్-4లో జరిగిన మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్ ఫీజును మాత్రమే ఛార్జర్స్ హెచ్‌సిఏకు చెల్లించింది. గత నాలుగు మ్యాచ్‌లకు ఇంకా రూ.1.2 కోట్ల బకాయిలు ఛార్జర్స్ హెచ్‌సిఎకు చెల్లించాలి. దీంతో హెచ్‌సిఏ మంగళవారం రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించింది. బకాయిలు చెల్లించే వరకు ఆడినిచ్చేది లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది.

అయితే హెచ్‌సిఏ బిసిసిఐ క్రింద పని చేస్తున్నందున మ్యాచ్ అడ్డుకునే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఛార్జర్స్ యాజమాన్యం తన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తుందో స్పష్టంగా తెలియపరిస్తే ఆడనిచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఐపిఎల్-4లో ఉత్తమ ప్రదర్శన కనబరచని ధక్కన్ ఛార్జర్స్ యాజమాన్యానికి ఇది మరో తలనొప్పిగా మారింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+