Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 7 వికెట్లతో అలవోక విజయం

AB de Villiers
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో భాగంగా ఇక్కడ వెస్టీండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్లు తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. డివిలియర్స్ (107) పరుగుల అజేయ సెంచరీతో జట్టు ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.223 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు ఆదిలో వికెట్లు కోల్పోయినప్పటకీ సమయోచితంగా ఆడి విజయ ముంగిట నిలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లు వెస్టిండీస్‌ను 222 పరుగులకు కట్టడి చేయడంతో బ్యాట్స్‌మెన్ పని సులభమైంది. అయినా 20 పరుగులకే దక్షిణాఫ్రికా రెండు వికెట్లను కోల్పోయింది.

సఫారీ ఇన్నింగ్స్‌ను స్మిత్, ఆమ్లా జోడీ ప్రారంభించింది. స్మిత్ స్వేచ్ఛగా ఆడినప్పటికీ, ఆమ్లా విండీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడ్డాడు. ఆమ్లా (14), కల్లిస్ (4) పరుగులు చేసి మొదట్లోనే నిష్క్రమించారు. అయితే స్మిత్-డివిలియర్స్ జోడి బాధ్యాతయుతంగా ఆడి జట్టు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. వీరిరువురు కుదురుకుంటున్న సమయంలో స్మిత్ (45)పరుగులు చేసి నిషమ్రించాడు. తరువాత డివిలియర్స్‌తో జత కలసిన డుమినీ (42) పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలుపు వాకిట నిలిపాడు. విండీస్ బౌలర్లలో రోచ్, పోలార్డ్, బెన్న్ తలో వికెట్టు తీశారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+